ల‌ంక‌ రివ్యూ రేటింగ్Lanka-Movie-Review-Rating
2017-04-21 07:57:04

చాలా ఏళ్ళ త‌ర్వాత రాశీ మ‌ళ్లీ ఫుల్ లెంత్ రోల్ చేసిన సినిమా లంక‌. ఒక‌ప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ గా చ‌క్రం తిప్పిన రాశీ.. మ‌రి ఇన్నేళ్ళ త‌ర్వాత కూడా అదే మ్యాజిక్ కొన‌సాగించిందా.. న‌టిగా మ‌ళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ లీడ్ చేస్తుందా.. అస‌లు లంక ఎలా ఉంది..?

క‌థ ‌: ముగ్గురు కుర్రాళ్లు ఓ షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేస్తుంటారు. ఊరు చివ‌ర పాడుప‌డ్డ బంగ‌ళాలో త‌మ షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేస్తారు. వాళ్ల‌కు అనుకోని రీతిలో మ‌ళ‌యాలంలో స్టార్ హీరోయిన్ అయిన స్వాతి(ఇషా సాహా) వీళ్ళ షార్ట్ ఫిల్మ్ లో న‌టిస్తుంది. అదే బంగ‌ళాలో రెబెకా(రాశీ) ఉంటుంది. ఆమెకు టెలీప‌తిపై అవ‌గాహ‌న ఉంటుంది. ఆ టెలీప‌తీ కార‌ణంగా చ‌నిపోయిన పిల్ల‌ల్ని బ‌తికే ఉన్నార‌ని భావిస్తుంటుంది. అలాంటి ఇంట్లోకి వీళ్లు షూటింగ్ కు వ‌స్తారు. ఆ త‌ర్వాత వాళ్ల‌కు ఎదురైన స‌మ‌స్య‌లేంటి..? హీరోయిన్ స్వాతికి ఏమ‌వుతుంది..? మ‌ధ్యలో శ‌ర‌త్(సిజ్జు) ఎందుకు వ‌స్తాడు..? ఇవ‌న్నీ అస‌లు క‌థ‌..

క‌థ‌నం : చిన్న సినిమాల్లోనే కొత్త కాన్సెప్టులు వ‌స్తుంటాయి. కానీ వాటిని హ్యాండిల్ చేయ‌డంలోనే అస‌లు స‌మ‌స్య వ‌స్తుంది.. లంక సినిమాకు కూడా ఇదే స‌మ‌స్య‌. టెలీప‌తి అనే కొత్త కాన్సెప్ట్ తీసుకున్నాడు శ్రీ‌ముణి. కానీ చెప్ప‌డంలోనే అస‌లు స‌మ‌స్య వ‌చ్చింది. కొన్ని స‌న్నివేశాలు బాగా తీసినా.. మిగిలిన వాటిని మాత్రం బోర్ కొట్టించేసాడు. అరే.. ఈ సీన్ ఏదో బాగుందే అనుకునేలోపే మ‌రో చెత్త సీన్ డిస్ట‌ర్బ్ చేస్తుంది. ఓవ‌రాల్ ఈ లంక కాన్సెప్ట్ బాగున్నా.. దాన్ని స్క్రీన్ పై తెచ్చిన విధానం బాగోలేదు.  ఓపెనింగ్ సీన్ లోనే ఏదో సైక్రియాటిస్ట్ సీన్ పెట్టేసి సినిమాపై ఆస‌క్తి క్రియేట్ చేసాడు ద‌ర్శ‌కుడు శ్రీ‌ముణి. ఆ త‌ర్వాత మ‌ళ్లీ చెత్త కామెడీ సీన్ల‌తో బోర్ కొట్టించేసాడు. ఎప్పుడైతే బంగళాలోకి వెళ్లి సీన్స్ షూట్ చేయ‌డం స్టార్ట్ చేస్తారో అప్పుడు కాస్త ఆస‌క్తి రేకెత్తించింది. ఫ‌స్టాఫ్ లో కొన్ని సీన్స్ మిన‌హా మిగిలిన సినిమా అంతా బోర్. ఇక సెకండాఫ్ లో కూడా ఇదే తంతు. అక్క‌డ‌క్క‌డా ఏదో ఆస‌క్తిగా ఉంటుంది అంత‌లోనే నీర‌సం వ‌చ్చేస్తుంది. కానీ ఆ త‌ర్వాత మ‌ళ్లీ బోర్ సీన్స్. క్లైమాక్స్ లో వ‌చ్చి రాశీ అస‌లు క‌థ చెప్పే వ‌ర‌కు కూడా సినిమా అర్థం కాదు. మొత్తానికి కాన్సెప్ట్ బాగున్నా తీసిన విధానం బాలేదు.

నటీన‌టులు : రాశీ, సిజ్జు, సాయి రోన‌క్, ఇషా సాహా త‌దిత‌రులు.. ద‌ర్శ‌కుడు, శ్రీ‌ముణి రాశీ చాలా రోజుల త‌ర్వాత ఫుల్ లెంత్ రోల్ చేసింది. ఈమె పాత్ర‌ను ద‌ర్శ‌కుడు తీర్చిదిద్దిన విధానం బాగుంది. కానీ సినిమాకు ఇది స‌రిపోదు. ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా తెలియ‌ని టెలీప‌తి కాన్సెప్ట్ కావ‌డంతో ఈమె పాత్ర కూడా కొత్త‌గా అనిపిస్తుంది. అయితే క‌థ క‌థ‌నం బాగోలేక‌పోవ‌డంతో రాశీ న‌ట‌న కూడా సినిమాను కాపాడ‌దు. ఇక ఇషా సాహా అందాల ఆర‌బోత‌కే స‌రిపోయింది. మిగిలిన వాళ్ళ‌లో సిజ్జు విల‌న్ గా ఓకే. హీరో బ్యాచ్ అంతా క‌థ‌తో పెద్ద‌గా క్యారీ అవ్వ‌రు.

టెక్నిక‌ల్ టీం : లంక సినిమా టెక్నిక‌ల్ టీంలో అంద‌రికంటే ఎక్కువ మార్కులు అందుకునేది సంగీత ద‌ర్శ‌కుడు శ్రీ‌చ‌ర‌ణ్. బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా చేసాడు. ఇక కెమెరామెన్ కూడా బాగానే ప‌నిత‌నం చూపించాడు. ద‌ర్శ‌కుడు శ్రీ‌ముణి క‌థ కొత్త‌గా రాసుకున్నాడు గానీ క‌థ‌నం బాగా రాసుకోలేక‌పోయాడు. విసిగించే స‌న్నివేశాలు ఎక్కువ‌గా పెట్టేసి.. క‌థ‌ను లాగడానికే ఎక్కువ ప్రాధాన్య‌త ఇచ్చాడు. ఈ క‌థ‌ను వీలైనంత త‌క్కువ టైమ్ లో చెప్పుంటే ఆస‌క్తిక‌రంగా ఉండేది. కానీ రెండు గంట‌ల 13 నిమిషాలు ఉండేస‌రికి బాగా సాగ‌దీసిన‌ట్లు అనిపించింది.

చివ‌ర‌గా : ఈ లంక భ‌రించ‌డం క‌ష్టం..

Rating : 2/5

More Related Stories