నా భర్త నా కంటే చిన్నవాడు..షాకింగ్ నిజాలు చెప్పిన లాస్యLasya
2020-11-13 13:12:16

బిగ్ బాస్ షో ద్వారా కంటెస్టెంట్స్ పర్సనల్ విషయాలు సైతం భయటపడటం సాధారణమే. ఇప్పటికే బిగ్ బాస్  కి వచ్చిన ఎంతో మంది కంటెస్టెంట్స్ తమ పర్సనల్ విషయాలను భయటపెట్టారు. గత సీజన్ బిగ్ బాస్-3లో అమిత్ తివారి తనకు బట్ట తల ఉందనే విషయాన్ని భయటపెట్టి అందర్నీ షాక్ కు గురి చేసాడు. ఇక ఎంతో మంది తాము సిగరెట్ తాగుతామని చెప్పకనే చెప్పేసారు. ఇక షోకి రేటింగ్ రావాలన్నా కూడా కంటెస్టెంట్స్ తమ పర్సనల్ విషయాలు భయటపెట్టాల్సిందే. ఎందుకంటే ప్రేక్షకులకు హౌస్ లో వాళ్లు ఆడే ఆటలకంటే వాళ్ళ నిజజీవితాల గురించి తెలుసుకోవాలనే ఎంతో ఆసక్తి ఉంటుంది. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 4 లో కూడా కంటెస్టెంట్స్ తమ నిజజీవితంలో జరిగిన విషయాలను భయట పెడుతూ షాక్ ల మీద షాకులు ఇస్తున్నారు. మొన్నటికి మొన్న యాంకర్ లాస్య తాను 2012లో ప్రేమ వివాహం చేసుకున్నానని కొన్ని కారణాలవల్ల 2014 లో తనకి ప్రెగ్నెన్సీ వస్తే తీయుంచుకున్నానని షాకింగ్ విషయాలు భయటపెట్టింది. 

ఇక తాజాగా నిన్నటి ఎపిసోడ్ లో సైతం లాస్య మరో సంచలన విషయం భయటపెట్టింది. తన భర్త తనకంటే ఒక సంవత్సరం చిన్నవాడిని లాస్య చెప్పింది. ఈ విషయం తన తల్లికి కూడా తెలియదని పేర్కొంది, బిగ్ బాస్ లోకి వచ్చాక తన కుటుంబానికి షాక్ ల మీద షాక్ లి ఇస్తున్నాననంటూ చెప్పుకొచ్చింది. అంతే కాకుండా తాను పెళ్లి చేసుకుని ఓ కోటీశ్వరుడు అనుకున్నారని కానీ అతడు ఒక మిడిల్ క్లాస్ కూడా కాదని అతని ఫైనాన్షియల్ బ్యాక్ గ్రౌండ్ తనకి మాత్రమే తెలుసని వెల్లడించింది. వయసులో చిన్నవాడైనా తన భర్త మనసులో పెద్దవాడని తనను బాగా చూసుకుంటాడని లాస్య ఎమోషనల్ అయింది. మొత్తానికి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన లాస్య అభిమానులకు మాత్రం షాక్ మీద షాక్ లు ఇస్తుంది.

More Related Stories