డ్యూయల్ రోల్ చేస్తున్న రత్తాలు.. ఇప్పటికైనా హిట్ వస్తుందా..laxmi
2019-12-02 13:53:45

లక్ష్మీ రాయ్.. ఈ పేరుకు తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. ఇక్కడ కొన్ని సినిమాలు కూడా చేసింది చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో కూడా ఈమె స్పెషల్ సాంగ్స్ చేసి స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకుంది. అయితే దాన్ని క్యాష్ చేసుకోవడంలో మాత్రం లక్ష్మీరాయ్ వెనకబడిపోయింది. టాలీవుడ్ 2 బాలీవుడ్ అన్ని ఇండస్ట్రీలు ట్రై చేసినా కూడా స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. మధ్యలో కొన్ని వివాదాల్లో ఇరుక్కున్న ఆ తర్వాత మళ్ళీ వచ్చి హీరోయిన్ గా తన ప్రయత్నాలు చేసుకుంటుంది. ఇక ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ ఓ సినిమాలో ద్విపాత్రాభినయం చేయబోతోంది. ఆ సినిమా టైటిల్ సిండ్రెల్లా. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన ఈ చిత్రాన్ని మ‌ల్టీ కల‌ర్‌ ఫ్రేమ్స్, ఎస్‌.ఎస్‌.ఐ ప్రొడ‌క్ష‌న్‌ బ్యాన‌ర్స్‌పై తెలుగులో మంచాల ర‌వికిర‌ణ్ `సిండ్రెల్లా` పేరుతోనే ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. ఎస్‌.జె.సూర్య ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసిన విను వెంక‌టేశ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా టీజ‌ర్‌ను ఆదివారం విడుద‌ల చేశారు. హార‌ర్ ఫాంట‌సీ, మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమా రానుంది. స‌ర్కార్ 3, కిల్లింగ్ వీర‌ప్ప‌న్ చిత్రాల‌కు కెమెరామెన్‌గా వ‌ర్క్ చేసిన ర‌మ్మీ ఈ సినిమా సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో మరోసారి తన పేరు గుర్తు చేయాలని చూస్తుంది లక్ష్మీరాయ్.

More Related Stories