ఆ ట్రైనర్ దగ్గరకే వెళ్ళిన ప్రభాస్Prabhas
2020-01-04 19:14:55

హీరోలలో కొంత మంది ఉంటారు, పాత్ర పాత్రకి వేరియేషన్స్ చూపించడమే కాక దానికి బాడీని మౌల్ద్ చేసే హీరోలు కొద్దిమందే ఉంటారు. అలాంటి వారిలో ఎన్టీఆర్ ఒకరు. ఈ మధ్య స్టార్ హీరోల నుండి చిన్న హీరోల వరకు బాడీ షేపింగ్స్ పై దృష్టి పెడుతున్నారనుకోండి అది వేరే విషయం. ఇక అరవింద సమేత సినిమా నుండి ఎన్టీఆర్ టాప్ జిమ్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ ఆధ్వర్యంలో జిమ్ చేసి తన బాడీని షేపింగ్ చేయించుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన  ఆర్ఆర్ఆర్ కోసం రామ్ చరణ్ ని కూడా ఆయనకే అప్పచేప్పేలా చేశాడు. ఇక ఆ ట్రైనర్ వర్క్ మీద జక్కన్న చాలా సంతృప్తిగా ఉన్నాడట. ఆ విషయం ప్రభాస్ తో చెప్పడంతో ఇప్పుడు స్టీవెన్స్ ని తన కోఅసం కూడా పని చేయమని అడిగాడట. ఎందుకంటే బాహుబలి సినిమా గురించి బరువు పెరిగిన ప్రభాస్ ఆ తర్వాత సాహో కోసం తగ్గాడు. బరువు తగ్గడంతో ప్రభాస్ మొహంలో అదో రకమైన తేడా వచ్చిందని అంటున్నారు. దాంతో ప్రభాస్ తన బాడీ ఫిట్ నెస్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని లాయిడ్ స్టీవెన్స్ ను కలిసినట్లు చెబుతున్నారు. 

More Related Stories