దేశం అంతా లాక్ డౌన్ లో ఉన్నా పెళ్లి ఆపుకోని హీరో Nikhil Kumaraswamy
2020-04-16 20:46:19

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ రేపు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు, హీరో నిఖిల్ గౌడ పెళ్లి యధావిధిగా జరగనుందని అంటున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా భారీ లేవల్లోనే జరుగుతున్నాయి. నిజానికి కొడుకు పెళ్లి కోసం కర్నాటకలోని రామనగర జిల్లాలోని తమ సొంత ఊళ్ళో 95 ఎకరాల విస్తీర్ణంలో వివాహ వేదికను నిర్మించాలని, బంధు, మిత్రులను, శ్రేయోభిలాషులను కలుపుకుని దాదాపు ఐదు లక్షల మందిని ఆహ్వానించాలని కుమారస్వామి భావించారట. పెళ్లి తర్వాత బెంగళూరులో అత్యంత వైభవంగా రిసెప్షన్ ఏర్పాటు చేయాలనుకున్నారట. 

కానీ ఈలోపే కరోనా కాటేసింది. అయితేనేం ఈనెల 17వ తేదీ ముహూర్తం మంచిదని అందుకే ఎలాగైనా తన కుమారుడు నిఖిల్ గౌడ పెళ్లి జరపాలని కుమారస్వామి నిర్ణయించారట. కరోనా నేపథ్యంలో తన కుమారుని పెళ్లికి ఎవరూ రావద్దని పార్టీ కార్యకర్తలను, శ్రేయోభిలాషులను కుమారస్వామి కోరుతున్నారని అంటున్నారు. ఈ పెళ్లికి దాదాపు 20 మంది వరకు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరవుతారని ఆయన చెబుతున్నా మరోవైపు పెళ్లి ఏర్పాట్లు మాత్రం భారీగానే సాగుతుండడంతో వివాదాస్పదం అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. నిఖిల్ జాగ్వార్ అనే సినిమాతో తెరంగ్రేటం చేశారు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించినా హిట్ అయితే కాలేదు.
 

More Related Stories