రకుల్ ప్రీత్‌ను చావు దెబ్బ కొట్టిన లాక్‌డౌన్..rakul
2020-04-28 14:50:23

ఒక్క రకుల్ ప్రీత్ మాత్రమే ఎందుకు లాక్ డౌన్ పీరియడ్ లో సినిమాలు లేక చాలా మంది హీరోయిన్లు పని లేకుండా ఉన్నారు కదా.. వాళ్లందరికీ కూడా చావు దెబ్బే కదా అనుకుంటున్నారా..? నిజమే కానీ మిగిలిన హీరోయిన్లకు కేవలం సినిమాలు మాత్రమే నష్టం.. కానీ రకుల్ మాత్రం బిజినెస్ కూడా లాస్ అయిపోయి పిచ్చి చూపులు చూస్తుంది. ఈమె సినిమాల‌తో పాటు బిజినెస్ కూడా చేస్తుంది. అందులో కూడా ఈమె తోపు. బిజినెస్ లో తనకు ఎవ‌రూ పోటీ కాద‌ని నిరూపించుకుంటుంది ర‌కుల్. అవ‌కాశాలు వ‌చ్చిన‌న్ని రోజులు బాగానే సినిమాలు చేసుకున్న ఈ ముద్దుగుమ్మ అప్పుడు సంపాదించిన మొత్తం అంతా బిజినెస్ పై పెట్టి ఇప్పుడు సంపాదించుకుంటుంది. అన్ని వ్యాపారాలు ఆరోగ్యం చుట్టూనే తిప్పుతుంది. ఇప్ప‌టికే జిమ్ బిజినెస్ కూడా వ‌ర్క‌వుట్ అయింది.

అయితే ఇప్పటి వరకు అందులో లాభాలు మాత్రమే చూస్తూ వచ్చిన రకుల్ కు ఇప్పుడు నష్టాలు కూడా కనిపిస్తున్నాయి. గత నెలన్నరగా జిమ్‌లు అన్నీ మూత పడిపోవడంతో అమ్మడికి భారీగానే లాస్ వస్తుందని తెలుస్తుంది. ఎఫ్45 పేరుతో హైదరాబాద్‌లో రెండు.. విజయవాడ, బెంగళూరులో ఒకటి జిమ్ ఉన్నాయి. అన్నీ ఇప్పుడు మూసేయడంతో రకుల్ కు నష్టాలు కోట్లలోనే వస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. పైగా స్టాఫ్ కు కూడా లక్షల్లో జీతాలివ్వాలి.. అవన్నీ మెయింటేన్ చేయడం ఇప్పుడు అమ్మడికి కష్టంగా మారిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. షూటింగ్స్ లేక‌పోతే హైద‌రాబాద్ తో పాటు విజ‌య‌వాడ, బెంగ‌ళూరుకు రౌండ్స్ వేస్తూనే ఉంటుంది రకుల్. కానీ ఇప్పుడు అలా కూడా చేయడం లేదు. లాక్ డౌన్ కారణంగా లాక్ అయిపోయింది. మొత్తానికి కరోనా పూర్తిగా తగ్గిపోయిన తర్వాత జిమ్స్ అన్నీ ఓపెన్ అయితే తప్ప రకుల్ కష్టాలకు బ్రేకులు పడవు. అప్పటి వరకు ఇంతే ఇక.

More Related Stories