ఆర్మూర్ లో లవ్ స్టొరీ షూటింగ్love story
2020-10-15 17:26:46

దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రస్తుతం నాగచైతన్య-సాయి పల్లవి జంటగా "లవ్ స్టొరీ" అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను కొంతవరకు పూర్తయ్యింది. కాగా ఇప్పుడు లవ్ స్టొరీ షూటింగ్ ను నిజమాబాద్ లోని ఆర్మూర్ లో చిత్రిస్తున్నారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా స్టోరీ ఉండటంతో శేఖర్ కమ్ముల షూటింగ్ స్పాట్ ను ఆర్మూర్ లో ఏర్పాటు చేశారు. ఈ సినిమాలో చైతూ-సాయి పల్లవి తెలంగాణ యాసలోనే మాట్లాడనున్నారు. ఇక ఇదివరకే ఫిదా సినిమాలో సాయి పల్లవి నిజామాబాద్ యాసతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఫిదా సినిమా షూటింగ్ ను కూడా శేఖర్ కమ్ముల ఆర్మూర్ లొనే చిత్రించారు. ఇప్పటికే లవ్ స్టొరీ చిత్రీకరణ సగం వరకు పూర్తవగా కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇటీవల షూటింగ్ లకు పర్మిషన్ ఇవ్వడంతో తిరిజి షూటింగ్ ను ప్రారంభించారు. ఈ సినిమాకు పవన్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. నారాయణ్ దాస్ సినిమాను నిర్మిస్తున్నారు.

More Related Stories