ఆగస్ట్ 6న నాగ చైతన్య లవ్ స్టోరీ విడుదల 



Love Story
2021-07-09 15:46:39

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్‌స్టోరీ’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్‌ 16న విడుదల కావాల్సి ఉంది.  కానీ కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా విడుదల వాయిదా పడింది. దీంతో ఈ సినిమా ఓటీటీలో రాబోతుందని అప్పట్లో పుకార్లు వచ్చాయి. దీనికి తగ్గట్లుగానే ఈ సినిమాకు 10 ఓటీటీ సంస్థల నుండి ఆఫర్లు వచ్చాయని, మంచి రేటుని ఇస్తామని చిప్పినప్పటికీ తాము ఒప్పుకోలేదని నిర్మాతలు చెప్పారు. 'ఫిదా' లాంటి మంచి లవ్ స్టోరీ ని రూపొందించిన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందడంతో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాపై సినీ అభిమానులలో ఉన్న ఆసక్తిని గమనించిన ఓటీటీ సంస్థలు మంచి ఆఫర్ ఇచ్చినప్పటికే ఈ చిత్రాన్ని థియేటర్లలోనే రిలీజ్ చేయాలని నిర్మాతలు ఫిక్స్ అయ్యారు. అయితే ఈ లవ్ స్టోరీ ని ఆగస్ట్ 6న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

More Related Stories