ప్రముఖ రచయిత వెన్నెలకంటి కన్నుమూతLyricist Vennelakanti Death
2021-01-05 18:15:15

తెలుగు సినిమా ప్రముఖ గీత రచయిత వెన్నెలకంటి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నారు. ఎన్నో డబ్బింగ్ చిత్రాలకు మాటలు, పాటలు అందించారాయన.

1957 నవంబర్ 30న నెల్లూరులో జన్మించారు. వెన్నెలకంటి పూర్తి పేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్. దాదాపు 2వేల పాటలు రాశారాయన. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారి పేర్లు శశాంక్ వెన్నెలకంటి, రాకేందుమౌళి. భార్య పేరు ప్రమీలాకుమారి. శశాంక్ వెన్నెలకంటి డబ్బింగ్ సినిమాలకు సంభాషణల రచయితగా ఉండగా.. రాకేందు మౌళి సినిమా గీత రచయితగా పనిచేస్తున్నారు. 

1986లో భాస్కర్ రావు డైరెక్షన్‌లో వచ్చిన శ్రీరామ చంద్రుడు సినిమాతో గీత రచయితగా వెన్నెలకంటి ప్రస్థానం మొదలైంది. ఎస్పీబీ ప్రోత్సాహంతో సినీ రంగంలోకి అడుగు పెట్టారు. జంద్యాల రాసిన ఏక్ దిన్కా సుల్తాన్, ఈ చరిత్ర ఏ సిరాతో, ఎవ్వనిచే జనించు, దర్పణం వంటి నాటకాలలో వెన్నెలకంటి నటించారు. హాలీవుడ్ చిత్రాల తెలుగు డబ్బింగ్ వెన్నెలకంటితోనే ఆరంభం అయ్యాయి. 34 ఏళ్లలో 1500కు పైగా స్ట్రెయిట్‌ పాటలు రాసిన వెన్నెలకంటి.. డబ్బింగ్ చిత్రాల్లో మరో 1500కు పైగా పాటలు రచించారు. బ్యాంకు ఉద్యోగిగాను ఆయన పని చేశారు.

More Related Stories