‘మా’ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలmaa election notification released
2021-09-17 23:22:32

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబరు 10వ తేదీ ఎన్నికలు జరుగుతాయి. ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూలులో పోలింగ్ జరగుతుంది. ఎన్నికల అధికారి వి. కృష్ణమోహన్ ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఎనిమిది మంది ఆఫీస్‌ బేరర్స్‌, 18 మంది ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుల కోసం జరిగే ఈ ఎన్నికలకు ఈ నెల 27 నుంచి 29 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. 30న నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్ ఉపసంహరణ అక్టోబరు 1, 2 తేదీల్లో సాయంత్రం 5 గంటల వరకూ ఉంటుంది. రెండో తేదీ సయాంత్రం బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. ఎన్నికల ఫలితాలను అక్టోబరు 10వ తేదీ రాత్రి ప్రకటిస్తారు.

నియమ నిబంధనలేమిటి?
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఒక్క పోస్ట్ కోసమే పోటీ చేయాల్సి ఉంటుంది. గత కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయి ఉండి 50 శాతం కన్నా తక్కువ ఈసీ మీటింగులకు హాజరు కాకపోతే పోటీ చేసే అర్హత ఉండదు. 24 క్రాఫ్ట్ లలో ఆఫీస్ బేరర్స్ గా ఉన్నవారు ఆ పదవులకు రాజీనామా చేయకపోతే ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కారు. ఈ నియమనిబంధనలకు లోబడి మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసే సభ్యులు మసలుకోవాల్సి ఉంటుంది.

More Related Stories