మాధవన్‌ రాకెట్రీ ట్రైలర్ టాక్ 



Rocketry Trailer
2021-04-02 07:27:59

మాధవన్‌ ప్రధాన పాత్రలో నటిస్తూ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు ట్రైలర్‌ను సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు విడుదల చేసి.. థియేటర్‌లో ఈ సినిమా చూసేందుకు ఎంతగానో వెయిట్ చేస్తున్నట్లుగా తెలిపారు. అలాగే ఈ చిత్రంతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తోన్న నటుడు మాధవన్‌కు, చిత్రయూనిట్‌కు మహేష్‌ శుభాకాంక్షలు తెలిపారు. 

''హీరో సూర్య.. టైటిల్‌ పాత్రధారి అయిన మాధవన్‌ను ఇంటర్వ్యూ చేస్తున్న సీన్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్‌.. ఆద్యంతం ఆకట్టుకునేలా ఉండటమే కాదు.. ఆలోచింపజేసేదిగా ఉంది. ‘ఓ వీధి కుక్కను కొట్టి చంపాలంటే దానికి పిచ్చి అనే పట్టం కడితే సరిపోతుంది. అదే విధంగా ఒక మనిషిని తలెత్తనివ్వకుండా కొట్టాలంటే దేశద్రోహి అనే పట్టం కడితే సరిపోతుంది’.. ట్రైలర్‌లోని ఈ డైలాగ్‌ ఒక్కటి చాలు ఈ సినిమా ఏ తరహా చిత్రంగా తెరకెక్కిందో చెప్పడానికి.  మాధవన్ నటనతో అభిమానులను ఆకట్టుకున్నారు.ఇక దర్శకరచయితగానూ మాధవన్ పనితనం ట్రైలర్ లో ఆశ్చర్యపరుస్తోంది.

More Related Stories