మల్లెపూలు బాగా నలిపిందా, అందుకే ఆమెకు పదవా..మాధవి లత సంచలనం



Madhavi Latha
2020-04-21 10:27:14

ఒక కార్యకర్తగా తెలుగుదేశంలోకి వచ్చిన సాధినేని యామిని సోషల్ మీడియాలో వైసీపీ అధినేత పైనా, ఆ పార్టీ నేతలపైనా తీవ్రస్థాయిలో విమర్శలు చేసి టీడీపీ అధిష్ఠానం దృష్టిని ఆకర్షించి, ఏకంగా అధికార ప్రతినిధి హోదా దక్కించేసుకుంది. ఆ అధికార ప్రతినిధి హోదాతో మరింత విజృంభించిన యామిని జనసేనాని పవన్ కల్యాణ్ పై భారీ స్థాయిలో విరుచుకుపడింది. పవన్-మల్లెపూలు ఎపిసోడ్ తో ఆమెకు ఎక్కడలేని పాప్యులారిటీ ఇచ్చింది. ఓ దశలో ఆమె పార్టీ టికెట్ ఆశించినట్టు వార్తలు వినిపించాయి. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం ఆమె బీజేపీ గూటికి చేరింది.  

అయితే ఇప్పుడు ఆమెకి పార్టీలో కీలక పదవి ఇస్తున్నట్లు వార్తలు వస్తుండడంతో బీజేపీలో గత ఎన్నికల నాటికే పార్టీ లో చేరి గుంటూరు నుండి పోటీ చేసిన మాధవి లత ఆమె మీద సంచలన వ్యాఖ్యలు చేసింది. పార్టీ కోసం కష్టపడిన వారిని పట్టించుకోకుండా నిన్న మొన్న పార్టీలో చేరేవారికి పదవులు కట్టబెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ఆమె ప్రశ్నిస్తోంది.  పవన్ మల్లెపూల ఎపిసోడ్ ని గుర్తు చేస్తూ మల్లెపూల వాసనలు గురించి ఇష్టం వచ్చినట్లుగా అబద్ధాలు చెప్పే వారికి, మల్లెపూలు నలిపిన కథలు బాగా తెలిసిన వారికి ఇలా పదవులు ఇస్తారా అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. మరి బీజేపీ అధిష్టానం ఎయా స్పందిస్తుందో వేచి చూడాలి మరి. 

More Related Stories