మధురిమ అందాల ఆరబోత అదరహో..

మధురిమ.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. అప్పుడప్పుడూ తెలుగు సినిమాలు చేసి.. ఇప్పుడు హిందీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది మధురిమ. అక్కడ నైరా బెనర్జీగా పేరు మార్చుకుని అమ్మడు ఫుల్లుగా అందాలన్నీ ఆరబోస్తుంది. ఆ మధ్య వన్ నైట్ స్టాండ్ సినిమా కోసం అదిరిపోయే హాట్ సీన్స్ కూడా చేసింది నైరా. తెలుగులో కొత్తజంటలో అటు అమలాపురం అంటూ ఆడిపాడింది కదా.. టెంపర్ లో సిస్టర్ రోల్ కూడా చేసింది. దానికి ముందు కూడా కొన్ని సినిమాలు చేసినా కూడా పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. ఎలాగైనా స్టార్ కావాలని చూస్తుంది మధురిమ. అందుకే అందాలనే ఆయుధంగా వాడేస్తుంది.
అప్పట్లో సన్నీలియోన్ హీరోయిన్ గా నటించిన వన్ నైట్ స్టాండ్ సినిమాలో నటించింది. ఆమెతో పోటీగా అందాలను కూడా ఆరబోసింది. ఆమెతో పోటీ పడాలంటే నైరా కూడా రెచ్చిపోవాలి కదా.. అందుకే రెండు పెగ్గులు వేసుకొచ్చి సీన్స్ ఇరగదీసిందట. అయితే ఇంటికెళ్లడానికి మాత్రం భయమేసిందట.. ఎక్కడ తమవాళ్లు కొట్టేస్తారో అని హాట్ సీన్స్ చేసినందుకు కాదు మందు కొట్టినందుకు..! ఇక ఇప్పుడు కూడా అదిరిపోయే హాట్ షో చేస్తూ గూగుల్ ను సైతం వేడెక్కిస్తుంది మధురిమ. మొత్తానికి ఇవన్నీ చూసిన తర్వాతైనా మధుకి అవకాశాలు ఇస్తారో లేదో చూడాలి.