మహా సముద్రం రిలీజ్ డేట్ ఫిక్స్



Maha Samduram
2021-01-30 10:58:25

ఆర్ఎక్స్ 100 సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు అజయ్ భూపతి  ప్రస్తుతం తెరకెక్కిస్తున్న సినిమా "మహా సముద్రం". ఈ సినిమాలో శర్వానంద్, సిద్ధార్థ్ లు హీరోలుగా నటిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్, అదితి రావ్ హైదరి హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంతే కాకుండా సినిమా పోస్టర్ లలోని ఎమోషనల్ డైలాగులు సినిమాపై ఇంట్రెస్ట్ పెంచుతున్నాయి. మరోవైపు లవర్ బాయ్ సిద్దార్థ్ ఈ సినిమాలో నెగిటివ్ రోల్ లో నటిస్తున్నాడని టాక్ నడుస్తోంది. అంతే కాకుండా చాలా కాలం గ్యాప్ తర్వాత సిద్ధార్థ్ మళ్ళీ తెలుగులో సినిమా చేస్తున్నాడు. దాంతో సిద్ధార్థ్ అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉండగా తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసింది. ఈ ఏడాది ఆగస్టు 19న సినిమాను విడుదల చేస్తునట్టు ప్రకటించింది. ఆర్ ఎక్స్ 100 సినిమాతో హిట్ కొట్టిన అజయ్ భూపతి ఈ సినిమాతో ఎలాంటి విజయం సాధిస్తాడో చూడాలి. 

More Related Stories