ముంబై థియేట‌ర్లు రీఓపెన్..కానీ



Maharashtra
2021-06-05 18:13:19

ముంబై వాసుల‌కు ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మ‌హ‌రాష్టలో ప్ర‌స్తుతం అన్ లాక్ ప్ర‌క్రియ మొద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈనేప‌థ్యంలో సినిమా థియేట‌ర్లు తెరుచుకునేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తిచ్చింది. అయితే ఇంకా కరోనా కేసులు న‌మోద‌వుతున్న నేప‌థ్యంలో ఓ కండిష‌న్ పెట్టింది. సీటింగ్ విధానాన్ని 50శాతానికి పరిమితం చేస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. థియేట‌ర్లు తెరుచుకున్నాయి. గానీ ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు వ‌స్తారా లేదా..? అన్న సందేహం నెల‌కొంది. క‌రోనా విజృంభ‌ణ ఇప్పుడిప్పుడే త‌గ్గుముఖం ప‌ట్టిన నేప‌థ్యంలో వ‌చ్చేందుకు సాహ‌సం చేస్తారా లేదా అన్న అనుమానం మొద‌లైంది. అయితే గ‌త లాక్ డౌన్ త‌ర‌వాత కూడా ఇలాంటి అనుమానాలే వ‌చ్చాయి. కానీ అప్పుడు ప‌రిస్తితులు సెకండ్ వేవ్ లో ఉన్నంత దారుణంగా లేవు. మ‌రి ప్రేక్ష‌కులు ఏం చేస్తారో చూడాలి. ఇదిలా ఉండ‌గా బాలీవుడ్ లో ఇప్ప‌టికే ప‌లువురు స్టార్ హీరోల సినిమాలు విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాయి. కాబ‌ట్టి థియేట‌ర్లు తెరుచుకున్న వెంట‌నే విడుద‌ల‌కు పోటీ ఏర్ప‌డే అవ‌కాశం కూడా ఉంది. 

More Related Stories