వెనక్కి తగ్గనంటున్న బన్నీ మహేష్ లు Mahesh Babu Allu Arjun
2019-10-17 10:38:36

సంక్రాంతికి పోటాపోటీగా సినిమాలు రిలీజ్ అవడం అనేది కామన్. రెండు సినిమాలు రిలీజ్ అయినా, మూడు సినిమాలు రిలీజ్ అయినా కూడా వాటి మధ్య ఒకటిరెండ్రోజులు గ్యాప్ ఉంటే పోటీ అనేది పెద్ద మ్యాటర్ కాదు. ఏ సినిమాలో కంటెంట్ బావుంటే, ఏ సినిమాకి టాక్ బావుంటే ఆ సినిమానే బాక్స్ ఆఫీస్ ని ఆ ఏడాది సంక్రాంతికి ఏలుతుంది. అయితే ఈసారి పోటీ మాత్రం కాస్త తేడాగా ఉంది. రజినీ కాంత్ డబ్బింగ్ సినిమా దర్బార్ ని పక్కన పెడితే మూడు తెలుగు సినిమాలు సంక్రాంతికి ఒకే రోజు రిలీజ్ కోసం ఉన్నాయి.  

మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా సంక్రాంతికి వస్తుంది అని ముందే అనౌన్స్ చేసి మరీ షూటింగ్ కి వెళ్ళారు. అలాగే అల్లు అర్జున్ నటిస్తున్న అల.. వైకుంఠపురములో సినిమా కూడా సంక్రాంతికి అని సినిమా మధ్యలోనే ప్రకటించారు. నిజానికి ఆ సినిమా ముందే జనవరి 12 న వస్తున్నట్టు డేట్ కూడా చెప్పేశారు. అయితే ఆ సినిమా ముందు రోజు మాత్రమే సరిలేరు నీకెవ్వరు రిలీజ్ చేసుకోవడానికి అనువుగా ఉండేట్టు ఉండడం వలన అల..వైకుంఠాపురాన్ని కాస్త వెనక్కి వెళ్ళి జనవరి 14 కి రావాల్సిందింగా రిక్వెస్ట్ చేశారట మహేష్ టీమ్. 

కానీ అల్లు కాంపౌండ్ నుండి నో చెప్పారని టాక్. దీంతో మరేమనుకున్నారో ఏమో ఈ రెండు సినిమాల నిర్మాతలు పంతం అట్టినట్టు ఒకే రోజున వస్తున్నారు.  ఆదివారం పూట ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు రిలీజ్. అదేకనుక జరిగితే థియేటర్స్ దగ్గర మామూలు కోలాహలం ఉండదు. కానీ ఈ పంతం రెండు సినిమాలకు కూడా నష్టం కలిగిస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం ఎవ్వరూ తగ్గట్లేదు. ఒక పక్క తన సినిమా అదిరిపోతుంది అని మహేష్, నా సినిమాకి తిరుగులేదు అని బన్నీ ఇద్దరూ కూడా ఎవరి మటుకు వాళ్ళు ధీమాగా ఉన్నారు. నిజానికి ముందు డేట్ వేసుకుంది అల..వైకుంఠపురములో కాబట్టి ఆ సినిమా డేట్ కాకుండా జనవరి 14 న మహేష్ రావచ్చు. కానీ వీకెండ్ కలెక్షన్స్ పూర్తిగా వదులుకోవాల్సి వస్తుందని దిల్ రాజు అండ్ కో పోటీకి వెళ్లారట. నిజానికి ఈ సినిమాల పెద్ద తలకాయలు ఇద్దరూ దిల్ రాజు, అల్లు అరవింద్ లు కలిసి హిందీ జెర్సీ ని నిర్మిస్తున్నారు. అంటే వీరిద్దరికీ మధ్య పంతాలు లాంటివి ఉండవని కొందరంటున్నారు. 
 

More Related Stories