అల్లు అర్జున్, మహేష్ బాబుకు ఇప్పుడు ఒక్కటే పని..mb
2020-04-28 15:14:34

ఎప్పుడూ షూటింగ్ బిజీలో ఉండే హీరోలు ఇప్పుడు పూర్తిగా ఫ్రీ అయిపోయారు. కరోనా వైరస్ కాస్త ప్రమాదకరంగానే ఉన్నా కూడా ఫ్యామిలీ టైమ్ మాత్రం చాలా దొరికింది. ఇన్నాళ్లూ ఉరుకులు పరుగుల జీవితంలో ఉన్న మన స్టార్స్ అంతా ఇప్పుడు ఏ టెన్షన్ లేకుండా హాయిగా కుటుంబంతో గడుపుతున్నారు. ముఖ్యంగా కొందరు హీరోలైతే పిల్లలే ప్రపంచంగా ఉన్నారు. అందులో అల్లు అర్జున్, మహేష్ బాబు గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. ఈ ఇద్దరికీ కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకులతో అప్పుడప్పుడూ ఆడుకుంటున్నారు కానీ కూతుళ్లను మాత్రం ఒక్క క్షణం కూడా విడిచి ఉండట్లేదు ఈ హీరోలిద్దరూ. పైగా ఎప్పటికప్పుడు తమ గారాల పట్టిలతో ఆడుకుంటూ ఉన్న ఫోటోలను వీడియోలను ఫ్యాన్స్‌ కోసం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. సినిమాల దగ్గరే కాదు.. కూతుళ్లతో ఆడుకోవడంలోనూ మహేష్ బాబుతో బన్నీ పోటీ పడుతున్నాడు. ఇక్కడ సితారతో సూపర్ స్టార్ అల్లరి చేస్తుంటే.. అక్కడ అల్లరి పిడుగు అర్హతో రోజంతా టైమ్ పాస్ చేస్తున్నాడు బన్నీ. మొత్తానికి ఈ చిన్నారుల అల్లరితో ఆయా హీరోలకు క్వారంటైన్ అలా క్వాలిటీగా గడిచిపోతుంది.

 

More Related Stories