కొండారెడ్డి బురుజు వద్ద మహేష్ బాబుSarileru-Nekevvaru-update.jpg
2019-09-23 10:17:03

రామోజీ ఫిలిం సిటీలో మహేష్ బాబు అది కూడా కొండా రెడ్డి బురుజు సెంటర్ లో. అదేంటి కొండారెడ్డి బురుజు కర్నూలులో కదా ఉండాల్సింది. మరి హైదరాబాద్‌లో ఉండడమేంటని ఆశ్యర్యపోతున్నారా.. వివరాల్లోకి వెళ్తే సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా, రష్మిక మందనా హీరోయిన్‌గా అనిల్ రావిపూడి దర్శకత్వంతో సరిలేరునీకెవ్వరు అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దిల్ రాజు, అనిల్ సుంకర, మహేశ్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సినిమాలోకొండారెడ్డి బురుజు ప్రాతంలో కీలక ఘట్టాలను చిత్రీకరించాల్సి ఉంది. అయితే మహేష్ బాబు భద్రతా కారణాల రీత్యా, ప్రజలకు కూడా ఇబ్బంది కలగకూడదనే ఉద్ధేశ్యంతో ఈ బురుజు సెట్‌ను హైదరాబాద్‌ లోని రామోజీ ఫిలిం సిటీలో రూపొందించారు. ఈ సెట్‌ లో మహేష్ బాబు షూట్ మొదలు పెట్టినట్టు దర్శకుడు అనిల్ రావి పూడి ట్విట్టర్ లో పేర్కొన్నారు.  గతంలో ఒక్కడు సినిమాలో మహేశ్‌బాబు, ప్రకాశ్‌రాజ్(ఓబుల్ రెడ్డి) మధ్య కొండారెడ్డి బురుజు సెంటర్‌లో తీసిన ఫైట్ విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో పదహారేళ్ళ క్రితం ఈ సెంటర్ చిరస్మరణీయం అయ్యిందని, ఇప్పుడు ఇన్నేళ్ళ తర్వాత అదే సెంటర్ లో మళ్ళీ షూట్ చేస్తున్నామని అనిల్ చెప్పుకొచ్చాడు. ఇక ఆ సెట్ వేసిన ఆర్ట్ దర్శకుడు ప్రకాష్ కి కూడా కృతజ్ఞతలు చెప్పుకొచ్చారు అనిల్ రావిపూడి. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. 

More Related Stories