తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కు మహేష్ బర్త్ డే శుభాకాంక్షలు

2021-05-31 17:25:54
ఈ రోజు కృష్ణ బర్త్ డే సందర్భంగా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సూపర్ స్టార్ తనయుడు ప్రిన్స్ మహేష్ మహేష్ బాబు తన ప్రేమతో కూడిన శుభాకాంక్షలు తెలియజేసారు. “జన్మదిన శుభాకాంక్షలు నాన్న. నాకు ఎప్పుడూ ఉన్నతమైన దారినే చూపిస్తున్న మీకు థాంక్స్ తెలియజేస్తున్నాను. మీకు తెలిసిన దానికంటే ఎక్కువే నా ప్రేమ మీ మీద ఉంటుంది” అని మహేష్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం తన తండ్రి కృష్ణ..బర్త్ డే సందర్భంగా..మూవీస్ కు సంబంధించిన లెటెస్ట్ అప్ డేట్ మహేష్ ఇస్తుంటారనే సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం కరోనా సిచువేషన్ వల్ల..ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదు. ఆయన న్యూ ఫిల్మ్…సర్కార్ వారి పాట చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.