ఇర్ఫాన్ ఖాన్ మృతికి సంతాపం తెలియచేసిన మహేష్.Mahesh Babu
2020-04-29 13:43:41

తెలుగు ఇండస్ట్రీలో ఇర్ఫాన్ ఖాన్ అందరికంటే మహేష్ బాబుకే ఎక్కువ తెలుసు. ఎందుకంటే ఆయనతో కలిసి సైనికుడు సినిమా చేసాడు ఈయన. పైగా ఇర్ఫాన్ నటించిన ఒకేఒక్క తెలుగు సినిమా ఇది. అప్పట్లో ఈ సినిమా డిజాస్టర్ అయినా కూడా ఇర్ఫాన్ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించాడు ఇర్ఫాన్ ఖాన్. పప్పు యాదవ్ పాత్రకు ప్రాణం పోసాడు. గుణశేఖర్ తెరకెక్కించిన సైనికుడు ఫ్లాప్ అయినా కూడా పప్పు పాత్ర మాత్రం బాగా గుర్తుండిపోయింది. బాలీవుడ్ లో ఈయన ఎన్ని సినిమాలు చేసినా కూడా సైనికుడు విలన్ అంటారు మన తెలుగు ప్రేక్షకులు. ఇప్పుడు ఈయన కన్ను మూయడంతో మహేష్ బాబు కూడా తన సంతాపం తెలియచేసాడు. చాలా త్వరగా ఓ టాలెంటెడ్ నటుడు వెళ్లిపోయాడు.. ఆయన ఆకస్మిక మరణం బాధిస్తుంది.. ఇది నిజంగా గుండె బద్ధలయ్యే నిజం.. ఇర్ఫాన్ మృతికి సంతాపం తెలియచేస్తున్నానంటూ ట్వీట్ చేసాడు సూపర్ స్టార్. 

More Related Stories