రోజుకి కోటి ఛార్జ్ చేస్తోన్న మహేష్mb
2020-03-01 08:01:43

మెగాస్టార్ చిరంజీవితో అనుబందం రీత్యా మహేష్ ఆయన మూవీలో నటించనున్నాడనే ప్రచారం జరుగుతోంది. మహేష్ ఒక పక్క వంశీ సినిమా క్యాన్సిల్ చేశాడు, పరశురామ్ తో సినిమాకి టైం పడుతుంది. దీంతో ఆయన ఈ సినిమా ఒప్పుకున్నట్టే చెబుతున్నారు. అయితే ఆ పాత్ర స్వరూపం ఏలా ఉంటుంది? అన్న వివరాలే బయటకు రాలేదు. అయితే అతిధి పాత్ర కాదు, ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నాడని మాత్రం అంటున్నారు. అయితే మరి ఈ సినిమా కు మహేష్ ఎంత పారితోషికం తీసుకుంటారనే దాని మీద చర్చ జరుగుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో 30 నుంచి 40 నిమిషాల పాటు మహేష్ కనువిందు చేయనున్నాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో 30 రోజుల పాటు మహేష్ కాల్షీట్స్ ఇవ్వాల్సి వస్తోందిట. దీంతో ఒక్కో రోజుకు కోటి చొప్పున 30 రోజులకు 30 కోట్ల వరకూ సూపర్ స్టార్ ఛార్జ్ చేస్తున్నారని అంటున్నారు. నిజానికి మహేష్ సినిమాలో ఎలాంటి వాటాలు తీసుకోకుండా నటిస్తే ఆ మాత్రం అయినా ఉంటుందని అంటున్నారు. మహేష్ హక్కులు తీసుకుని ఉంటె మెహర్ రమేష్ లాంటి వాళ్ళతో అయినా రిలీజ్ చేసుకునే వాడు. కానీ ఇది మెగా కాంపౌండ్ సినిమా కావడంతో ఆ ఛాన్స్ లేదట.

 

More Related Stories