సరిలేరు నీకెవ్వరు సెన్సార్ పూర్తి.. టాక్ ఏంటో తెలుసా..mb
2020-01-03 02:05:40

మహేష్ బాబు అభిమానులకు మరో పండగ లాంటి వార్త. సరిలేరు నీకెవ్వరూ సినిమా సెన్సార్ పూర్తైపోయింది. సినిమాలో కామెడీతో పాటు యాక్షన్ కూడా బాగానే ఉండటంతో దీనికి యు బై ఏ సర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్ సభ్యులు. జనవరి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ఈ చిత్రం. దీనికి సంబంధించిన అఫీషియల్ పోస్టర్స్ కూడా విడుదల చేస్తున్నారు దర్శక నిర్మాతలు. టీజర్ విడుదలయిన తర్వాత ప్రమోషన్ ఎక్కడ ఆగడం లేదు.

సరిలేరు నీకెవ్వరు టీజర్ విడుదల దగ్గర నుంచి వరుసగా సినిమాకు సంబంధించిన ఒక్క విషయం చెబుతూ వస్తున్నాడు అనిల్ రావిపూడి. ఈ సినిమాలో అజయ్ పాత్ర మహేష్ పాత్రకు ట్విస్ట్ ఇవ్వడమే కాకుండా మహేష్ పాత్రను ఎలివేట్ చేసే విధంగా ఉంటుందనీ.. ఎవరు ఊహించని విధంగా ఉండటంతో ధియేటర్ లో ప్రేక్షకులకు మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం అని అంటున్నారు.

అంతేకాదు సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఒక విజయశాంతి మినహా మిగిలిన పాత్రలన్నీ అనిల్ రావిపూడి తనదైన శైలిలో కామెడీ చేయించాడని తెలుస్తోంది. ఆ కామెడీకి ప్రేక్షకులు విపరీతంగా నవ్వుకోవడం ఖాయం అని అంటున్నారు. ముఖ్యంగా సీరియస్ గా నటిస్తూ ఆ నటనలోనే కామెడీని పలికించే ప్రకాష్ రాజ్.. నట విశ్వరూపం ఈ సినిమాలో మరోసారి ప్రేక్షకులకు కనిపిస్తుందనీ హామీ ఇస్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి.

మొన్న టీజర్ లో కూడా ప్రకాష్ రాజ్ చెప్పిన డైలాగు ఓ రేంజ్ లో హైలైట్ అయింది. ప్రతి సంక్రాంతికి అల్లుళ్లు వస్తారు.. ఈ సంక్రాంతికి మొగుడు వస్తున్నాడు అంటూ ఈయన చెప్పిన డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఇక ఈ సినిమాలో మరో హైలెట్ ఎపిసోడ్ కూడా ఉంటుందని అది దాదాపు 39 నిమిషాల పాటు సాగుతుందని తెలుస్తోంది. జబర్దస్త్ కామెడీ షో లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న చమ్మక్ చంద్ర, అప్పారావు బ్యాచ్ మీద కలిసి అనిల్ రావిపూడి ఒక ట్రైన్ ఎపిసోడ్ రాశాడని.. దానికి రేపు థియేటర్ లో పడి పడి నవ్వుకోవడం ఖాయం అని తెలుస్తోంది. ఆ ఎపిసోడ్ లోనే రష్మిక ఫ్యామిలీ మహేష్ బాబును పడేయడానికి పడే పాట్లు నవ్వు తెప్పిస్తాయి అని ప్రచారం జరుగుతుంది.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను జనవరి 5న ఎల్బీ స్టేడియంలో భారీగా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. మెగాస్టార్ చిరంజీవి దీనికి చీఫ్ గెస్ట్ గా వస్తున్నాడు.

More Related Stories