సంక్రాంతికి సర్కారు వారి పాట



 Mahesh babu
2021-01-29 15:43:20

మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా "సర్కారు వారి పాట". ఈ సినిమాకు పరశురాం దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్,మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ స్, 14రీల్స్ బ్యానర్ ల పై గోపిచంద్ ఆచంట, రామ్ ఆచంట, నవీన్, రవికుమార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా ఆర్.మది పని చేస్తున్నారు. అంతే కాకుండా ప్రస్తుతం ఫుల్ జోష్ మీద ఉన్న సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ సినిమాకు స్వరాలు అందిస్తున్నారు. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దుబాయ్ లో జరుగుతోంది. దాంతో ఇటీవలే మహేష్ బాబు కుటుంబం సినిమా షూటింగ్ కోసం దుబాయ్ వెళ్ళింది. ఇక ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తిచేస్తున్నారు. సినిమానుండి విడుదల చేసిన మహేష్ బాబు ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. లాంగ్ హెయిర్ తో మెడ పై టాటూ తో మహేష్ ఊరమాస్ లుక్ లో కనిస్తున్నాడు. ఇక తాజాగా విడుదల తేదీని ప్రకటించిన చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. చేతిలో తలపు చెవి గుత్తులతో తాజా పోస్టర్ కూడా ఆకట్టుకుంటోంది.

More Related Stories