ఎప్పటికీ మీరే నా సూపర్ స్టార్.. కృష్ణకు మహేష్ విషెస్..mahesh
2020-05-31 19:57:02

సూపర్‌ స్టార్‌ కృష్ణ ఘట్టమనేని జన్మదినం సందర్భంగా ఫ్యాన్స్‌, టాలీవుడ్‌ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అందులో చిరంజీవి నుంచి చిన్న హీరోల వరకు అంతా ఉన్నారు. ఇక ఆయన తనయుడు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. మీకు ఎప్పటికీ రుణపడే ఉంటాను.. ఎప్పటికీ మీరే నా సూపర్‌ స్టార్‌.. హ్యాపీ బర్త్‌డే నాన్న అంటూ ఎమోషనల్ ట్వీట్‌ చేసాడు సూపర్ స్టార్. అంతే కాకుండా తండ్రితో చిన్నప్పుడు దిగిన ఫోటోను కూడా అభిమానులతో పంచుకున్నాడు మహేష్ బాబు. ఈ ఫోటో కొడుకు దిద్దిన కాపురం సమయంలో తీసింది. అప్పుడు 100 రోజుల వేడుకలో షీల్డ్ అందుకుంటూ ఈ ఫోటోకు పోజిచ్చాడు మహేష్ బాబు.

కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. విజయశాంతి హీరోయిన్. ఇక తండ్రి పుట్టిన రోజు సందర్భంగా మే 31 సాయంత్రం సోషల్‌ మీడియాలో అభిమానులతో ముచ్చటించనున్నాడు. ఈ సందర్భంగా ఇన్‌స్టాలో సాయంత్రం 5 గంటలకు క్వశ్చన్‌ అండ్‌ ఆన్సర్‌ సెషన్‌ ఉండబోతుంది. ఈ ఛాట్‌లో తన సినిమాల గురించి మాత్రమే కాకుండా పర్సనల్ విషయాలు కూడా పంచుకోబోతున్నాడు మహేష్ బాబు. ఇక ఇప్పటికే పరశురామ్ దర్శకత్వంలో తన 27వ సినిమా సర్కారు వారి పాటను అనౌన్స్ చేసాడు మహేష్ బాబు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌, 14 రీల్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

 

More Related Stories