రాజకీయాల గురించి మరోసారి మాట్లాడిన మహేష్ బాబు..mb
2020-02-19 14:32:05

తెలుగు ఇండస్ట్రీలో రాజకీయం అంటే తెలియని ఒకే ఒక్క హీరో మహేష్ బాబు. పొరపాటున కూడా పాలిటిక్స్ గురించి ఎక్కడా ఎప్పుడూ మాట్లాడడు ఈయన. అడిగినా కూడా తనకు తెలియదు అంటూ సమాధానం ఇచ్చి సైలెంట్ గా పక్కకి తప్పుకుంటారు సూపర్ స్టార్. సొంత బావ రాజకీయాల్లో ఉన్న కూడా ఆయన గురించి కూడా ఎప్పుడూ ప్రచారం చేయలేదు మహేష్ బాబు. ఎప్పుడో ఒకసారి సోషల్ మీడియాలో మాత్రం బావకు సపోర్ట్ చేయండి అంటూ అభిమానులను కోరాడు. అంతకు మించి ఆయన చేసిన రాజకీయాలు ఏమీ లేవు. ఇప్పుడు కూడా సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత పూర్తిగా హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాడు మహేష్. కొన్ని రోజులకు దుబాయ్ న్యూయార్క్ లాంటి ప్రదేశాలను చుట్టేస్తూ హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు. సరిలేరు నీకెవ్వరు సినిమా కోసం ఐదు నెలల పాటు రెస్ట్ లేకుండా కష్టపడిన మహేష్ బాబు.. ఆ సినిమా తర్వాత ఏకంగా ఐదు నెలల పాటు విశ్రాంతి తీసుకుంటున్నాడు. మే నెల నుంచి వంశీ పైడిపల్లి సినిమా మొదలు పెట్టనున్నారు ఈయన.

అప్పటివరకు కుటుంబంతోనే సమయం గడపాలని ఫిక్స్ అయిపోయాడు. ప్రశాంతంగా హాలిడే ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబుకు ఈ మధ్యే ఒక ఇంటర్వ్యూలో పొలిటికల్ క్వశ్చన్స్ ఎదురయ్యాయి. భరత్ అనే నేను సినిమాలో ముఖ్యమంత్రిగా నటించిన అనుభవం ఉండటంతో ఒకవేళ మిమ్మల్ని రాష్ట్రానికి ఒక రోజు ముఖ్యమంత్రి చేస్తే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అంటూ మహేష్ బాబును ఒక యాంకర్ ప్రశ్నించింది. దీనికి సూపర్ స్టార్ అదిరిపోయే సమాధానం చెప్పాడు. తను కానీ ఒక రోజు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రాన్ని ఆ దేవుడే కాపాడాలి అంటూ సెటైర్లు వేశాడు సూపర్ స్టార్. తనకు సినిమాలు తప్ప మరో ప్రపంచం తెలియదని.. రాజకీయాల గురించి అసలు నాలెడ్జ్ లేదని చెప్పాడు. అందుకే తాను ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం పూర్తిగా గాడి తప్పుతుందని.. అప్పుడు ఆ దేవుడే వచ్చి కాపాడాలని తన మీద తనే పంచులు వేసుకున్నాడు. ఆయన సమాధానం విన్న తర్వాత అభిమానులు కూడా నవ్వుకుంటున్నారు.

More Related Stories