కొండారెడ్డి బురుజు దగ్గర మహేష్ షూటింగ్ Mahesh Babu
2019-08-26 13:06:58

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న 26 వ చిత్రం సరిలేరు నీకెవ్వరు. వరుస హిట్ సినిమాల దర్శకుడు అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని అనీల్ సుంకర - దిల్ రాజులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేష్ సరసన రష్మికా నటిస్తున్న ఈ సినిమా మొదటి రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. మొదటి షెడ్యూల్ కాశ్మీర్ లో షూట్ జరుపుకోగా రెండో షెడ్యూల్ ఇక్కడే అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ట్రైన్ సెట్ లో షూట్ జరుపుకుంది. ఇక ఈ సినిమా మూడో షెడ్యూల్ కోసం రెడీ అయ్యిందని అంటున్నారు. తన కెరీర్ కో మొదటిసారిగా మహేష్ ఓ మిలటరీ అధికారిగా నటిస్తుండడం ఈ సినిమా మీద ఆసక్తిని పెంచుతోంది. అయితే మహేష్ బాబు కోసం ఈ సినిమాలో భారీ సెట్స్ వేయాడానికి కూడా సిద్దం అవుతున్నారు. మహేష్ ఒక్కడు సినిమా టైంలో కర్నూలులోని ‘కొండారెడ్డి బురుజు’ వద్ద షూట్ చేశారు. 

అయితే అప్పుడు ఆయన కొత్త హీరో కావడంతో, క్రౌడ్ కంట్రోల్ విషయంలో ఎటువంటి సమస్య రాలేదు. ఇప్పుడు అతను సూపర్ స్టార్, ఆ బురుజు వద్ద ఇప్పుడు షూటింగ్ సాధ్యం కాదు. అందుకే మహేష్‌ నటిస్తున్న తాజా సినిమా 'సరిలేరు నీకెవ్వరు' కోసం కొండా రెడ్డి బురుజు సెట్ నే నిర్మించారు. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా కొండారెడ్డి బురుజు సెట్‌ను ఆర్ట్ డైరెక్టర్స్ నిర్మించినట్టు సమాచారం. ఇక నేటి నుండి ఈ సినిమా షూటింగ్ ఈ సెట్‌లోనే జరగనుందని అంటున్నారు. ఇక ఈ షెడ్యూల్‌లో మహేష్‌తో పాటు రాజేంద్ర ప్రసాద్ కూడా పాల్గొంటున్నారని అంటున్నారు. ఈ సినిమాలో మేజర్‌ అజయ్‌కృష్ణ పాత్రలో మహేష్‌ కనిపించనున్నారు.   వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమాలో విజయ శాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు.

More Related Stories