బిగ్ బాస్ హోస్ట్ గా మహేష్ mahesh babu
2020-03-12 17:52:26

దక్షిణాది అన్ని భాషల్లో బిగ్ బాస్ రియాలిటీ షో సక్సెస్‌ అయింది. ఈ రియాలిటీ షో తెలుగులో కూడా ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఈ ఏడాది మళ్ళీ నాలుగో సీజన్ కి రెడీ అవుతోంది. మొదటి సీజన్ ని ఎన్టీఆర్ నడిపించగా, రెండో సీజన్ ని నాని నడిపించాడు, ఇక మూడో సీజన్ నాగార్జున  నడిపి అందరి మన్ననలను 

ఇక ఈ ఏడాది నాలుగో సీజన్ కి ఇప్పటి నుందే నిర్వాహకులు సన్నాహాలు మొదలు పెట్టారని అంటున్నారు. నాగార్జున ఒక వర్గం మన్ననలను అయితే అందుకున్నారు కానీ టీఆర్పీలు కానీ తెచ్చుకోలేక పోయారు. అందుకే అయితే ఈ సారి హోస్ట్‌ విషయంలో బిగ్‌బాస్‌ బృందం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. అందుకే ఈ ఏడాది మొదట్లోనే ‘సరిలేరు నీకెవ్వరు’ అంటూ హిట్టు కొట్టు మంచి ఫాంలో ఉన్న మహేష్ ను హోస్ట్ గా ప్లాన్ చేయాలని అనుకుంటున్నట్టు చెబుతున్నారు. 

తెర మీద కనపడితే కోట్ల కలెక్షన్స్ తెచ్చే మహేష్ బుల్లితెరపై టీఆర్పీలను కూడా కొల్లగొట్టేందుకు సిద్ధమైనట్లు సోషల్ మీడియాలో ప్రచారం మొదలయింది. అంతే కాదు మహేష్ ఫ్యాన్స్ అయితే ఏకంగా ఆయన హోస్ట్ అన్నట్టుగా ఉన్న ఒక పోస్టర్ ని కూడా రెడీ చేసి వదిలారు. ప్రస్తుతం ఈ పిక్ ట్విట్టర్ లో హల్చల్ చేస్తోంది. అయితే ఈ విషయం మీద ఇప్పటిక్ దాకా అయితే అటు మహేష్‌బాబు కానీ, బిగ్‌బాస్‌ నిర్మాతలు కానీ స్పందించలేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో!

More Related Stories