మహేష్ బాబుకి సర్జరీ...షాక్ లో ఫ్యాన్స్

మహేష్ నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు మంచి హిట్ అయిన సంగతి తెలిసిందే. అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం మహేష్ ప్రమోషన్ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నాడు. ఇక తన సినిమా అయిపోయి ఖాళీగా ఉన్న టైంలో తన ఫ్యామిలీతో కలిసి విహారయాత్రలకి వెళ్ళే మహేష్ ఈ సారి అమెరికాలోని న్యూయార్క్‌కి వెళ్ళాడు. అక్కడ పిల్లలు, వైఫ్‌తో కలిసి వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు. రీసెంట్గా తన శ్రీమతి నమత్ర జన్మదినోత్సవ వేడుకలను కూడా అక్కడే జరిపాడు సూపర్ స్టార్. వారం రోజుల తర్వాత మహేష్ తిరిగి హైదరాబాద్‌కి రానున్నట్టు ఆ తర్వాత వంశీ పైడిపల్లితో కలిసి క్రేజీ ప్రాజెక్ట్ మొదలు పెట్టనున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఆయనకు అక్కడే సర్జరీ జరగబోతోందని సమాచారం. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన మోకాలు నెప్పితో బాధపడుతున్నారట. ఈ క్రమంలో ఈ నెలాఖరున ఆయన సర్జరీ చేయించుకోబోతోన్నట్లు విశ్వసనీయ వార్గాల సమాచారం. సర్జరీ అనంతరం ఐదు నెలలు రెస్ట్ తీసుకోవాలని కూడా చెప్పడంతో ఆయన ఫ్యాన్స్ కి ఇది ఇబ్బందే అని అంటున్నారు. ఆగడు షూటింగ్ సమయంలో మహేష్ మోకాలు దెబ్బ తగిలిందట. 2017లో ఆయన సర్జరీ చేయించుకున్నా డాక్టర్స్ చెప్పినట్లు బెడ్ రెస్ట్ తీసుకోకపోవటంతో మళ్లీ మొదటికి వచ్చిందని ఇప్పుడు నొప్పి తీవ్రతరం కావడంతో మరోసారి ఎలా అయినా సర్జరీ చేయించుకోవాలని ఆయన భావిస్తున్నారట. ఈ సర్జరీ తర్వాత ఆయన్ ఐదు నెలలు రెస్ట్ తీసుకోబోతున్నారని అంటున్నారు.