హిమాలయాలకు మహేష్ బాబు.. రజనీకాంత్ బాటలో సూపర్ స్టార్..mb
2020-03-10 19:39:54

హిమాలయాలు అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చే పేరు రజినీకాంత్. సినిమాలు లేనప్పుడు ఆయన ఆధ్యాత్మికంగా అక్కడికి వెళ్లి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటాడు. ఇప్పుడు ఈయన దారిలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా వెళ్తున్నాడు. ఈయన కూడా ఆధ్యాత్మిక చింతనలో కాలం గడపడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం ఈయన ఖాళీగా ఉన్నాడు. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత వంశీ పైడిపల్లితో అనుకున్న సినిమా అనుకోకుండా ఆగిపోయింది. దాంతో  మహేష్ బాబుకు బ్రేక్ వచ్చేలా కనిపిస్తోంది. దానికితోడు పరుశురామ్ దర్శకత్వంలో నటించాల్సిన సినిమా కూడా మరికొన్ని రోజులు ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. చిరంజీవి సినిమా కూడా  మహేష్ బాబు చేస్తాడు అని గ్యారెంటీ లేదు.

దాంతో అనుకోకుండా వచ్చిన ఈ విరామాన్ని ఒక ఆధ్యాత్మిక యాత్రతో ఫిల్ చేయాలని చూస్తున్నాడు మహేష్ బాబు. దీని కోసం అదిరిపోయే ప్లాన్ ఒకటి సిద్ధం చేస్తున్నాడు. ఎప్పుడు విదేశాలకు వెళ్లే సూపర్ స్టార్ ఈ సారి హిమాలయాలను ఎంచుకున్నాడు. అందుకే త్వరలోనే అక్కడికి వెళ్లి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని ఆలోచిస్తున్నాడు సూపర్ స్టార్. ఇప్పటి వరకు మనకు తెలిసిన హీరోలలో ఒక రజనీకాంత్ మాత్రమే హిమాలయాలకు వెళ్లేవాడు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా అదే చేస్తున్నాడు. అసలు మహేష్ లాంటి హీరో హిమాలయాలకు వెళ్తున్నాడని తెలిసిన వెంటనే అభిమానులు షాక్ అవుతున్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు మహేష్ బాబు. చాలా మార్పు వచ్చింది అంటున్నారు ఫ్యాన్స్. ఏదైనా కూడా హిమాలయాల నుంచి వచ్చిన తర్వాత పరశురామ్ సినిమాపై ఫోకస్ చేయనున్నాడు సూపర్ స్టార్.

More Related Stories