మహేష్ వంశీతో సినిమా చేస్తున్నట్టా..లేదా Mahesh Babu
2020-08-29 19:10:11

ఈ యేడాది మొదట్లోనే సంక్రాంతికి మహేష్ బాబు-అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి హిట్ కొట్టాడు. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా కూడా నిలిచింది. ఇక ఈ సినిమా తరువాత సినిమాగా మహేష్ పరుశురామ్ తో చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ముందు వంశీ పైడిపల్లి తో సినిమా ఉంటుందని అనుకున్నా కారణాలు ఏవయినా కానీ ఆ ప్రాజెక్ట్ అయితే ప్రస్తుతానికి పక్కన పెట్టారు. పరశురామ్ తో సర్కారు వారి పాట సినిమా అనౌన్స్ చేశారు. రాజమౌళి మహేశ్‌ ను డైరెక్ట్‌ చేస్తున్నట్టు... లైవ్‌ ఇంటర్వ్యూలో  పేర్కొన్నాడు. అయితే ఈ సినిమా మొదలుకావడానికి రెండేళ్లు పడుతుంది. 

మరి ఈ లోగా మరో రెండు సినిమాలు చేయాలన్న ప్లాన్‌ లో మహేశ్‌ వున్నాడట. రాజమౌళి ఎప్పుడయితే మహేష్ తో సినిమా కాన్ఫామ్ చేశాడో ఇక అప్పటి నుండి ఈ సినిమా గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇక మహేష్ లైనప్ లో చాలా మంది దర్శకుల పేర్లు వినిపిస్తున్నా ఇప్పుడు వంశీ పైడిపల్లి పేరు వినపడం లేదు. “సర్కారు వారి పాట” అనంతరం ఆయనతో సినిమా ఉంటుందని టాక్ వచ్చింది కానీ ఇప్పుడు మాత్రం అసలు ఈ దర్శకుని పేరే వినిపించడం లేదు. ఈయన రామ్ చరణ్ తో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు చెబుతున్నారు. ఈ విషయం మీద క్లారిటీ రావాల్సి ఉంది. 

More Related Stories