మహేష్ హీరో అయితే తాను విలన్ గా నటిస్తానన్నాడట  mahesh babu
2020-08-13 22:46:28

తెలుగులో స్టార్ హీరోగా ఉన్న మహేష్ బాబు - తమిళ హీరో ఇళయదళపతి విజయ్ కలిసి నటించబోతున్నారంటూ స్పైడర్ కు ముందు వార్తలు వచ్చాయి. నిజానికి మహేష్ సూపర్ హిట్ సినిమాలు తమిళ్ లో విజయ్ రీమేక్ చేసి మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. దీంతో ఈ వార్తలు నమ్మదగినట్టే ఉన్నాయని అనుకున్నారు. అయితే ఆ వార్త వార్త వరకే పరిమితం అయింది. డైరెక్టర్ మురగదాస్ మహేష్ - విజయ్ లతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారని అన్నారు అప్పట్లో. స్పైడర్ సినిమా సమయంలో పలు ఇంటర్వ్యూలో మురగదాస్ ఈ విషయాన్ని ప్రస్తావించారు కూడా. అయితే 'స్పైడర్' మూవీ ప్లాప్ అవడంతో పెద్దగా ఈ విషయం మీద చర్చ జరగలేదు. ఆయన కంటే ముందే మణిరత్నం కూడా వీరిద్దరిని ఒకే స్క్రీన్ పై చూపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసారు.

 ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ 'పొన్నియన్ సెల్వమ్' సినిమాలో ముందుగా మహేష్ - విజయ్ లను కూడా నటింపజేయాలని మణిరత్నం భావించారు. దానికి హీరోలిద్దరూ ఓకే చెప్పినా ఏవో కారణాలతో అది సెట్ కాలేదు. వీరి ప్లేస్ లోనే విక్రమ్ - కార్తీలతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. అయితే స్పైడర్ కోసం పెద్ద ప్లానె వేసాదట మురుగదాస్. అదేంటంటే తమిళ్ లో మహేష్ బాబు విలన్ గా విజయ్ హీరోగా, ఇక్కడ మహేష్ హీరోగా విజయ్ విలన్ గా స్పైడర్ సినిమా ప్లాన్ చేశారట. అయితే ఈ సందర్భంగా విజయ్ ఓ కండిషన్ పెట్టారట. మహేష్ బాబు హీరోగా నటిస్తేనే తాను తెలుగులో విలన్ గా చేస్తానని.. ఒకవేళ వేరే హీరో అయితే ఈ ప్రాజెక్ట్ లో యాక్ట్ చేయనని విజయ్ చెప్పేశారట. అయితే ఎందుకో కానీ ఈ సినిమా కి ఇద్దరూ కలిసి నటించలేదు. ఈ సినిమాలో విజయ్ నటించాల్సిన పాత్రలో ఎస్ జే సూర్య నటించారు.

More Related Stories