ఈ వారం లెక్క తప్పదు.. బిగ్ బాస్ నుంచి అతడు ఔట్.. mahesh vitta
2019-10-12 18:37:05

బిగ్ బాస్ కు నాగార్జున హోస్ట్ అయిన తర్వాత ఎలిమినేషన్ పై ఆసక్తి తగ్గిపోయింది. ఎవరు వెళ్లిపోతున్నారు అనేది ఇంత కూడా సీక్రేసీ మెయింటేన్ చేయడం లేదు. ముందు రోజే ఎవరు బయటికి వస్తున్నారనే విషయంపై సోషల్ మీడియాలో లీకులు బయటికి వచ్చేస్తున్నాయి. అక్కడ ఎపిసోడ్ షూట్ చేయగానే ఇక్కడ బయటికి తెలిసిపోతుంది. ఈ వారం కూడా ఇదే జరుగుతుంది. బిగ్ బాస్ నుంచి ఈ వారం మహేష్ విట్ట బయటికి వచ్చేస్తున్నాడు. నిజానికి గత వారమే ఈయన ఎలిమినేట్ అయ్యాడంటూ వార్తలొచ్చాయి. కానీ చివరి నిమిషంలో పునర్నవి బయటికి వచ్చేసింది. కానీ ఈ సారి మాత్రం అలా జరగదని.. మహేష్ ఈ సారి బయటికి రావడం ఖాయం అంటున్నారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కూడా షూట్ చేసినట్లు తెలుస్తుంది. దాంతో పక్కా ఇన్ఫర్మేషన్ బయటికి వచ్చేసింది. ఆదివారం ఎపిసోడ్ శనివారం మధ్యాహ్నానికే షూట్ చేస్తున్నారు. నాగార్జున తన షూట్స్ కోసమని ముందుగానే ఎపిసోడ్స్ షూట్ చేస్తుండటంతో ఎలిమినేషన్ ప్రక్రియపై ఏ మాత్రం ఆసక్తి లేకుండా మారిపోతుంది. మహేష్ విట్టతో పాటు ఈ వారం రాహుల్, వరుణ్ సందేశ్ నామినేషన్స్ లో ఉన్నారు. అయితే ఆ ఇద్దరు కీలకం కావడంతో మహేష్ ఈ సారి బయటికి వచ్చేస్తున్నాడు. వచ్చే వారం నుంచి మరింత ఆసక్తిగా మారబోతుంది ఈ సీజన్. చూడాలిక.. ఈ సారి ఎవరు టైటిల్ గెలవబోతున్నారో..? 

More Related Stories