మహేష్ బాబు కూతురు తొలి సినిమా.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్.. Mahesh
2019-11-11 16:24:19

మహేష్ బాబు కుటుంబం అంతా సినిమా వాళ్లతోనే నిండిపోయింది. ఆ ఇంట్లో బాలనటులకు కూడా కొదవ లేదు. స్వయంగా మహేష్ బాబు కూడా బాట నటుడే. ఈయన చిన్నపుడే చాలా సినిమాల్లో నటించాడు.. అవార్డులు కూడా సాధించాడు. ఇక ఆయన తనయుడు గౌతమ్ కృష్ణ కూడా ఐదేళ్ల కింద నేనొక్కడినే సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. తొలి సినిమాతోనే తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు గౌతమ్. ఇక ఇప్పుడు మహేశ్‌ కూతురు సితార కూడా వెండితెరపై సందడి చేయబోతుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. దాంతో సూపర్ స్టార్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ వాల్‌ డిస్నీ యానిమేషన్‌ స్టూడియోస్‌ నిర్మించిన చిత్రం 'ఫ్రోజెన్‌-2' నవంబరు 22న విడుదల కానుంది. ఈ చిత్ర తెలుగు వర్షన్ కోసం చాలా మంది ప్రముఖులు డబ్బింగ్ చెబుతున్నారు. అందులో చిన్నప్పటి ఎల్సా పాత్రకు సితార డబ్బింగ్‌ చెప్పనుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దానికి సంబంధించిన పోస్టర్ కూడా విడుదల చేసారు చిత్రయూనిట్. ఇక ఇదే పాత్రకు పెద్దైన తర్వాత నిత్య మీనన్ డబ్బింగ్‌ చెప్పనున్నట్లు ప్రకటించారు. రెండు పోస్టర్లు ఒకేసారి విడుదల చేసారు దర్శక నిర్మాతలు. 2013లో డిస్నీ సంస్థ నుంచి వచ్చిన యానిమేషన్‌ చిత్రం ఫ్రోజెన్‌ బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు రెండో పార్ట్ వస్తుంది.. క్రిస్‌ బక్‌, జెన్నీఫర్‌ లీ ఈ చిత్రానికి సంయుక్తంగా దర్శకత్వం వహించారు. హిందీలో ఎల్సా పాత్రకు ప్రియాంకా చోప్రా.. అన్నా పాత్రకు పరిణీతి చోప్రా డబ్బింగ్‌ చెప్పారు. ఈ మధ్య మన తెలుగు నటులతో హాలీవుడ్ సినిమాలకు డబ్బింగ్ చెప్పించడం అనేది కామన్ అయిపోయింది. ఆ మధ్య లయన్ కింగ్ సినిమాలో నాని డబ్బింగ్ చెప్పాడు.. దానికి ముందు అల్లాద్దీన్ సినిమాకు వెంకటేష్, వరుణ్ తేజ్ స్వరాన్ని అరువిచ్చారు. ఇక ఇప్పుడు సితార చెప్పబోతుంది.

More Related Stories