బంపర్ ఆఫర్ కొట్టేసిన మల్లేశం హీరోయిన్pink
2019-12-18 20:37:20

పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల్లోకి వస్తున్నాడని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. అది ఆయన కన్ఫాం చేయకున్నా నిర్మాత దిల్ రాజు పవన్ తో సినిమా చేస్తున్నానని క్లారిటీ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ రీఎంట్రీగా బాలీవుడ్ పింక్ సినిమా తెరకేక్కబోతుందని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి బాలీవుడ్ నిర్మాత బోని కపూర్ , దిల్ రాజులు కలిసి నిర్మిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా యూనిట్ నుంచి అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ సినిమాలో లాయర్ పాత్రలో నటించబోతున్నాడు పవర్ స్టార్. దీనికి లాయర్ సాబ్ అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉంది. ఈ సినిమాలో కథ ప్రకారం ముగ్గురు హీరోయిన్లు కావాలి. ఇందులో ఓ హీరోయిన్‌గా అనన్యను తీసుకున్నారట దర్శక నిర్మాతలు. ఈ అనన్య ఎవరా ? అనుకుంటున్నారా మల్లేశం సినిమాలో హీరోయిన్‌గా నటించింది ఈమె. ఆ సినిమాలో ప్రియదర్శి సరసన హీరోయన్ గా నటించింది అనన్య. ఆ సినిమా తర్వాత మరో రెండు సినిమాల్లో నటించినా కూడా అనన్యకు పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే ఇప్పుడు ఆమె పవన్ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైందని చెబుతున్నారు. ప్రస్తుతం ప్లే బ్యాక్ సినిమాలో కూడా హీరోయిన్‌గా నటించింది అనన్య.ఆ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. 

More Related Stories