పవన్ కళ్యాణ్ పార్టీ పేరుతో మోసం.. జన సైనికుడి దారుణం..pk
2019-09-01 20:50:56

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఓడిపోయినా కూడా ప్రజల్లో దానిపై ఓ నమ్మకం ఉంది. ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా పవన్ కచ్చితంగా అధికారంలోకి వస్తాడని.. తమ సమస్యలు తీరుస్తారని చాలామంది అభిమానులు నమ్ముతున్నారు. అయితే ఆ పార్టీలో పవన్ పేరును వాడుకొని కొందరు సొమ్ము చేసుకుంటున్నారు అనే విమర్శలు కూడా చాలా రోజులుగా వస్తున్నాయి. ఇప్పుడు దీనికి ప్రత్యక్ష సాక్ష్యం కూడా కంటి ముందు నిలిచింది. తాజాగా జనసేన పేరు చెప్పుకొని తూర్పు గోదావరి జిల్లాలో ఒక జన సైనికుడు భారీ మోసానికి పాల్పడ్డాడు. జనాల దగ్గర డబ్బులు కాజేసి ఉడాయించాడు. ఇప్పుడు ఈ కేసును పోలీసులు చాలెంజింగ్ గా తీసుకున్నారు. అసలేం జరిగిందంటే జగ్గంపేట మండలం మామిడాడ శరకణం గణేష్ అనే జనసేన పార్టీ కార్యకర్త కొద్ది రోజుల క్రితం యర్రవరంలో మాధవీలత ఫౌండేషన్ ఏర్పాటు చేశాడు. అక్కడికి వచ్చిన ఆటో డ్రైవర్లకు లేనిపోని కట్టుకథలు చెప్పాడు. లక్ష రూపాయలు కడితే మిగిలిన  సొమ్ము మొత్తం జనసేన పార్టీ ఎన్ఆర్ఐ కార్యకర్తల నుండి ఉచిత సబ్సిడీ వస్తుందని డ్రైవర్లను నమ్మించాడు. ఈయన మాటలు నమ్మి ఆటోడ్రైవర్లు ఒక్కొక్కరు 120000 చెల్లించి ఫైనాన్స్ కంపెనీల నుంచి ఆటోలు తీసుకున్నారు. అయితే డ్రైవర్లు చెల్లించిన లక్షలతో గణేష్ ఎప్పుడో ఊరు దాటేశాడు. ఇక ఆటో ఫైనాన్స్ కంపెనీలు డ్రైవర్లను మిగిలిన EMI కట్టాలంటూ నోటీసులు పంపించడంతో మోసపోయిన విషయాన్ని అప్పుడు తెలుసుకున్నారు. గణేష్‌తో పాటు ఆటో ఫైనాన్స్ కంపెనీలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. గృహ నిర్మాణాలకు కూడా సబ్సిడీ వస్తుందని గతంలో సొమ్ములు వసూలు చేసినట్లు గణేష్‌పై ఆరోపణలు ఉన్నాయి. ప్రత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాల్లో అతడి మాటలు నమ్మి 200 మందిపైగా మోసపోయినట్టు తెలుస్తోంది. జనసేన పేరు చెప్పి తమను నిలువునా ముంచిన గణేష్‌ను అరెస్ట్‌ చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని బాధితులు కోరుకుంటున్నారు. మరి ఇది పవన్ వరకు వెళ్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. పార్టీ పేరు వాడుకొని మోసం జరిగింది కాబట్టి పవన్ బాధ్యత వహించాలి అంటున్నారు కొందరు రాజకీయ నేతలు కూడా.

More Related Stories