బాలయ్యను ఫాలో అవుతున్న మంచు మనోజ్manchu manoj
2020-02-17 11:32:27

ఒకే సినిమాలో కలిసి నటించిన ఇద్దరు కథానాయకులు ఒకే పాత్రలో కనిపిస్తే ? ఊహకే అందడం లేదు కదా. అలంటి రేర్ ఫీట్ మనం టాలీవుడ్ లో చూడనున్నాం. బాలకృష్ణ, మంచు మనోజ్‌ లు కలిసి ‘ఊ.. కొడతారా ఉలిక్కిపడతారా’ సినిమా చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో ఆయన రెండు పాత్రలు చేయనుండగా అందులో ఒకటి అఘోరా పాత్ర. ఆ లుక్‌లో బాలయ్య ఎలా ఉంటాడా అని ఆశగా ఎదురు చూస్తున్నారు ఆయన అభిమానులు.

ఇక మరోపక్క చాలా గ్యాప్ తరువాత తిరిగి కెమెరా ముందుకొస్తోన్న మనోజ్ కూడా 'అహం బ్రహ్మస్మి' సినిమాలో అఘోరాగా సాహసం చేయబోతున్నాడని అంటున్నారు. రెండు సినిమాలు రోజుల వ్యవధిలోనే విడుదలవుతాయని, ఒకే పాత్రతో ఈ ఇద్దరు హీరోలు బాక్సాఫీసు వద్ద సందడి చేయనున్నారు. మరి అఘోరాగా ఎవరు ప్రేక్షకుల్ని మెప్పిస్తారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. 

More Related Stories