తప్పు నాదే.. విడాకులపై మరోసారి స్పందించిన మనోజ్..manoj
2020-05-21 08:16:56

కరోనా వైరస్ కారణంగా సెలబ్రిటీలు ఎవరు కాలు బయట పెట్టడం లేదు. ఇంట్లోనే ఉండి అభిమానులతో మాట్లాడుకుంటున్నారు. వాళ్లతో మనసు విప్పి మాట్లాడటానికి ఇంతకంటే మంచి సమయం మరొకటి కాదు అని అనుకుంటున్నారు. అందుకే అందరూ ట్విట్టర్ లో లైవ్ చాట్ చేస్తున్నారు. అందులో మంచు మనోజ్ కూడా ఉన్నాడు. పైగా మే 20న ఈయన పుట్టిన రోజు. దాంతో 10 బస్సులు పెట్టి సొంత ఖర్చుతో వలస కూలీలను సొంతూళ్లకు పంపించాడు మంచు మనోజ్. అంతేకాకుండా తన బర్త్ డే వేడుకులను కుటుంబ సభ్యులతో జరుపుకున్నాడు. ఇదిలా ఉంటే తన జీవితంలో జరిగిన అతి ముఖ్యమైన విషాదం గురించి మరోసారి గుర్తు చేసుకున్నాడు మనోజ్. ప్రతి మనిషి జీవితంలో కూడా కొద్దిరోజులు చీకటి ఉంటుందని.. అలాగే తన జీవితంలో కూడా చీకట్లు కమ్ముకున్నప్పుడు మళ్ళీ వెలుతురు వస్తుందా లేదా అనే అనుమానాలు వచ్చాయని చెప్పాడు మనోజ్. తన మనసులో మళ్ళీ ఎవరిమీదైనా ప్రేమ పడుతుందా లేదా.. అసలు తనలో ప్రేమంటూ ఉందా.. ఇంకా ఎవరినైనా ప్రేమిస్తానా లేదా అనే అనుమానాలు వచ్చాయని గుర్తు చేసుకున్నాడు మనోజ్.

ఐదేళ్ల పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా ఎక్కడో తప్పు జరిగిందని.. తేడా కొట్టిందని చెబుతున్నాడు మనోజ్. జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఆలోచించలేం అని.. అసలు ఆ బాధ అందరికంటే ఎక్కువ తనకే ఉంటుందని చెప్తున్నాడు. ఆ విషయం అందరికంటే ముందు తనకే తెలుసు కాబట్టే సిమ్లా నుంచి హిమాలయాల వరకు ట్రెక్కింగ్ చేసానని చెప్పుకొచ్చాడు మనోజ్. ఆ తర్వాత జరగబోయే దాని గురించి ఆలోచించానని చెప్పాడు ఈయన. చీకట్లో ఉన్న తన జీవితంలోకి వెలుతురులా వచ్చింది తన కోడలు విద్యా నిర్వాణ అంటున్నాడు మనోజ్. తను మాట్లాడే పద్ధతి కానీ.. ఆడుకోవడం కానీ అన్ని తన జీవితాన్ని మార్చేశాయని చెబుతున్నాడు. పూర్తిగా చీకట్లోకి వెళ్లిపోయిన తన జీవితాన్ని మళ్లీ వెలుగులోకి తీసుకొచ్చింది తన కోడలు అంటున్నారు మంచు మనోజ్. తన అక్క మంచు లక్ష్మి.. విద్యను చాలా బాగా పెంచుతుందని మెచ్చుకున్నాడు. మొత్తానికి విడాకుల తర్వాత మనోజ్ చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడని ఈ మాటలు చూస్తుంటే అర్ధం అవుతుంది.

 

More Related Stories