త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న మంచు మనోజ్



 manchu manoj
2021-02-06 13:32:46

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ త్వరలో మళ్ళీ పెళ్లి పీటలు ఎక్కబోతునట్టు తెలుస్తోంది. మంచు మనోజ్ ప్రణతి అనే యువతిని గతంలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రణతి అమెరికాలో ఉద్యోగం చేస్తుంది. మనోజ్ ఇక్కడ సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేవాడు. ప్రణతి ఉద్యోగం వదిలి ఇండియాకు రాలేక..మనోజ్ ఇండియా వదిలి అమెరికాలో ఉండటం ఇష్టం లేక ఇలా రెండేళ్లు వైవాహిక జీవితాన్ని కొనసాగించారు. అయితే ఇలా దూరంగా విడివిడిగా ఉండటం ఇష్టంలేక విడిపోయి జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. దాంతో 2020 వ సంవత్సరం లో విడకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని మనోజ్ తన సోషల్ మీడియాలో వెల్లడించారు. దాంతో ఆయన అభిమానులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అయితే తాజాగా మనోజ్ మాలి పెళ్లి పీటలు ఎక్కబోతునట్టు వార్తలు వస్తున్నాయి. మనోజ్ కోసం మోహన్ బాబు తమ చుట్టాలమ్మాయిని చూసారట. అంతే కాకుండా మోనోజ్ కూడా పెళ్లికి ఒకే  చెప్పాడట దాంతో ఈ ఏడాదే మే లో మనోజ్ మళ్ళీ పెళ్లి పీటలు ఎక్కబోతునట్టు టాలీవుడ్ లో జోరుగా ప్రచారం నడుస్తుంది.

More Related Stories