భక్త కన్నప్పతో నా మార్కెట్ 100 కోట్లు దాటేస్తుందంటున్న విష్ణు..  Manchu Vishnu
2020-03-09 20:10:57

ఏమైందో తెలియదు కానీ కొన్ని రోజులుగా మంచి వారసులు. ఇద్దరు సినిమాలు చేయడం మానేశారు. మనోజ్ పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటే. విష్ణు మాత్రం మంచి కథలు దొరకడం లేదని సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఇక ఈయన డ్రీమ్ ప్రాజెక్ట్ భక్తకన్నప్ప ఇంకా లైన్ లోనే ఉంది. మరోవైపు మనోజ్ కూడా మూడేళ్ల గ్యాప్ తీసుకుని ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అంటూ వస్తున్నాడు. 

ఇక విష్ణు కూడా భక్త కన్నప్పతో పాటు మోసగాళ్లు సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా హాలీవుడ్ రేంజ్ లో ఉంటాయని ధీమాగా చెబుతున్నాడు విష్ణు. దీని గురించి ఎవరూ మాట్లాడకపోయేసరికి సినిమా ఆగిపోయిందేమో అనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు అమెరికాలో జరుగుతున్నాయని తెలియజేశారు విష్ణు. దీన్ని ఒక హాలీవుడ్ డైరెక్టర్ తెరకెక్కించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తనికెళ్ల భరణి భక్తకన్నప్ప సినిమాకు కథ స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్నాడు. 

ఇదిలా ఉంటే ఈ సినిమాలో శివుడి పాత్రలో హాలీవుడ్ నటుడు కనిపించబోతున్నాడు. ఈ సినిమా తర్వాత కచ్చితంగా తన మార్కెట్ 100 కోట్లకు చేరిపోతుందని చెబుతున్నాడు విష్ణు. ఈ సినిమా కోసం 95 కోట్ల బడ్జెట్ పెడుతున్నామని చెప్పాడు ఈయన. దాంతో పాటు మోసగాళ్లు సినిమాను కూడా హాలీవుడ్ దర్శకుడే తెరకెక్కిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు తన కెరీర్ ను మార్చేస్తాయని చెబుతున్నాడు ఈయన.

More Related Stories