చిల్ బ్రో నుంచి మంగ్లీ పాడిన బొడ్రాయి పాట‌కు అనూహ్య స్పంద‌న‌Mangli Chil Bro Song tremendous Response
2021-10-23 20:50:32

అరుణోద‌య ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ లో ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 1గా రాబోతున్న మూవీ చిల్ బ్రో. మొద‌టి సినిమా అయినప్ప‌టికీ.. నిర్మాతగా శ్రీను చెంబేటీ ఈ సినిమాను అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించారు. సూర్య శ్రీనివాస్, ప‌వ‌న్ కేసి, రూపిక‌, ఇందు ముఖ్య తారాగ‌ణంగా న‌టిస్తున్న ఈ సినిమాను ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైనర్ గా ద‌ర్శ‌కుడు కుంచం శంక‌ర్ తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన చిల్ బ్రో ప‌బ్లిసిటీ కంటెంట్ కి ప్రేక్ష‌కులు నుంచి అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించింది. ఈ నేప‌థ్యంలో పముఖ గాయ‌ని మంగ్లీ పాడిన బొడ్రాయి అంటూ సాగే పాట‌ను చిత్ర బృందం విడుద‌ల చేశారు. 

మంగ్లీ వాయిస్ కి, మ్యూజిక్ డైరెక్ట‌ర్ సురేశ్ బొబ్బిలి ఇచ్చిన ట్యూన్స్ వెర‌సీ ఈ పాట ప్ర‌స్తుతం ట్రెండ్ అవుతుంది. మ్యాంగో మ్యూజిక్ ద్వారా ఈ సినిమా ఆడియో విడుద‌లైంది. అతి త్వ‌ర‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లుగా నిర్మాత శ్రీను చెంబెటీ తెలిపారు. సూర్య శ్రీనివాస్, ప‌వ‌న్ కేసి, రూపిక‌, ఇందు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి బ్యాన‌ర్ - అరుణోద‌య ప్రొడ‌క్ష‌న్, నిర్మాత - శ్రీను చెంబేటి, దర్శ‌క‌త్వం - కుంచం శంక‌ర్, మ్యూజిక్ - సురేశ్ బొబ్బిలి.
 

More Related Stories