మరో ప్రస్థానం రివ్యూMaro prasthanam Review
2021-09-23 23:20:48

యువ హీరో తనీష్ నటించిన లేటెస్ట్ మూవీ మరో ప్రస్థానం. ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ జాని దర్శకత్వం వహించారు. ముస్కాన్ సేధి కథానాయిక కాగా, వరుడు ఫేమ్ భానుశ్రీ మెహ్రా కీలక పాత్ర పోషించింది. ఇది రెగ్యులర్ మూవీ కాదు. కాన్సెప్ట్ బేస్డ్ మూవీ. ప్రజెంట్ కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ కి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. అందుచేత ట్రైలర్ తో మెప్పించిన మరో ప్రస్థానం సినిమా కూడా ఖచ్చితంగా నచ్చుతుందని టీమ్ గట్టి నమ్మకంతో ఉన్నారు. ఈరోజు మరో ప్రస్థానం సినిమా రిలీజైంది. మరి.. టీమ్ నమ్మకం నిజమైందా..? లేదా..? అనేది చెప్పాలంటే.. ముందుగా కథ చెప్పాలి. 

కథ - శివ (తనీష్) ముంబాయిలో క్రైమ్ చేసే గ్యాంగ్ లో ఒకడు.  ఈ గ్యాంగ్ కి లీడర్ రాణె భాయ్ (కబీర్ దూహాన్ సింగ్). క్రైమ్ చేసుకుని బతికే శివ నైని (అర్చనా ఖన్నా)ను చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. నైని కూడా శివను ప్రేమిస్తుంది. లవ్ లైఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి క్రైమ్ లైఫ్ కి ఫుల్ స్టాప్ పెట్టి గుడ్ బాయ్ లా మారిపోవాలి అనుకుంటాడు ఈ బాడ్ బాయ్. ఇక అప్పటి నుంచి కష్టలు మొదలవుతాయి. తన గ్యాంగ్లోని మనుషులే తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని చంపేస్తారు. అంతే పగతో ఊగిపోతాడు శివ.

సీక్రెట్ ఆపరేషన్ ద్వారా ఆ గ్యాంగ్ చేసే క్రైమ్ ని బయటపెట్టాలి అనుకుంటాడు. చాలా రిస్క్ చేస్తాడు. ఈ క్రమంలో జర్నలిస్ట్ (భానుశ్రీ మెహ్రా) కూడా రిస్క్ లో పడుతుంది. శివ బెస్ట్ ఫ్రెండ్ ఉద్దవ్ కూడా ఈ రిస్క్ లో పడతాడు. చివరికి శివ సీక్రెట్ ఆపరేషన్ సక్సస్ అయ్యిందా..? లేదా..? రాణె భాయ్ కి ఎలా బుద్ది చెప్పాడు..? అతన్ని ఎలా అంతం చేసాడు..? అనేదే మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్
తనీష్ నటన
స్ర్కీన్ ప్లే
యాక్షన్ సీన్స్

మైనస్ పాయింట్స్
రెగ్యులర్ స్టోరీ కాకపోవడం

విశ్లేషణ - తనీష్ కే కాకుండా తెలుగులోనే ఇదో కొత్త తరహా కథ అని చెప్పచ్చు. సింగిల్ షాట్ లో సినిమా అనే ప్రయోగాత్మక సినిమా చూస్తున్నంత సేపు టీమ్ ఈ సినిమా తీయడానికి ఎంత కష్టపడ్డారో అనిపిస్తుంది. డైరెక్టర్ జాని టాలెంట్ కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. ఏదో రెగ్యులర్ మూవీ చేయకుండా కొత్త సినిమా అందించాలని డైరెక్టర్ జాని చేసిన ప్రయత్నాన్ని అభినందించాల్సిందే. తనీష్‌, ముస్కాన్ సేథీ, భానుశ్రీ మెహ్రా, రాజా రవీంద్ర, కబీర్ దుహాన్ సింగ్.. ఇలా ప్రతి ఒక్కరు ఎంతో ప్రేమించి చేసిన సినిమా ఇది. 

ఈ ఇంటెన్షన్ యాక్షన్ మూవీలో హార్ట్ టచ్చింగ్ లవ్ స్టోరీ చెప్పడం బాగుంది. అలాగే వసంత కిరణ్ రాసిన సంభాషణలు, సునీల్ కశ్యప్ సంగీతం సినిమాకి హైలైట్ అని చెప్పచ్చు. ఓ వైపు సింగిల్ షాట్ లో ఎలా తీసారా అని.. మరో వైపు నెక్ట్స్ సీన్ లో ఏం జరుగుతుందో అని ఉత్కంఠతో చూసేలా ఈ సినిమా ఉంది. కొత్త తరహా కథలను చూడాలనుకునే వారికి బాగా నచ్చుతుంది. అలాగే తనీష్ తో యాక్షన్ మూవీ కూడా చేయచ్చు అని చెప్పిన సినిమా ఇది. టోటల్ గా ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ సినిమా మాస్ ఆడియన్స్ కి విపరీతంగా నచ్చుతుందని చెప్పచ్చు. 
 

More Related Stories