మాస్టర్ ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. విజయ్ సునామి..



 Master
2021-01-23 13:53:53

సరిగ్గా 10 రోజుల కింద మాస్టర్ సినిమా థియేటర్లలో విడుదల అవుతుంది అని తెలిసినప్పుడు కలెక్షన్స్ ఎలా వస్తాయని అభిమానులతో పాటు సౌత్ ఇండస్ట్రీ మొత్తం వేచి చూసింది. ఎందుకంటే దాదాపు 200 కోట్ల బిజినెస్ చేసిన సినిమా.. పైగా విజయ్ లాంటి సూపర్ స్టార్ హీరో కావడంతో ఖచ్చితంగా థియేటర్లకు జనాన్ని ఆయన రప్పిస్తాడని అందరిలో నమ్మకం ఉంది. ఇప్పుడు ఆ నమ్మకం నిజమైంది. మాస్టర్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ చూసిన తర్వాత కరోనా వైరస్ ఒకటి ఉంది అనేది జనాలు మరిచిపోయారని అర్థమవుతుంది. జనవరి 13న విడుదలైన ఈ సినిమా తొలి వారం ఏకంగా 100 కోట్ల షేర్ వసూలు చేసి అందరిలోనూ కొత్త ఆశలు చిగురింపజేసింది. లోకేష్ కనకరాజు తెరకెక్కించిన ఈ సినిమా తెలుగులో కూడా అద్భుతంగా విజయం అందుకుంది. నిజానికి డివైడ్ టాక్ తో మొదలై సంచలన వసూళ్లు సాధించిన మాస్టర్. మరి తొలివారం ఏయే రాష్ట్రాల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందో చూద్దాం..

మాస్టర్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ (షేర్)..

తమిళనాడు: 56 కోట్లు
ఏపీ & తెలంగాణ: 13 కోట్లు
కర్ణాటక: 6.25 కోట్లు
కేరళ: 4.65 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా: 2.65 కోట్లు
టోటల్ ఇండియా: 82 కోట్లు

USA: 1.32 కోట్లు
ఆస్ట్రేలియా: 2 కోట్లు
న్యూజిలాండ్: 36 లక్షలు
UAE: 9.5 కోట్లు
రెస్ట్ ఆఫ్ వరల్డ్: 5 కోట్లు

వరల్డ్ వైడ్ ఫస్ట్ వీక్ టోటల్: 99 కోట్లు

ఏదేమైనా ప్యాండమిక్ తర్వాత విడుదలైన తొలి భారీ సినిమా అంచనాలను అందుకొని ఇలా సంచలన వసూళ్లు సాధించడం దర్శక నిర్మాతలకు ధైర్యాన్ని ఇస్తోంది. ఇప్పటికీ వసూలు స్టడీగా ఉండటంతో కచ్చితంగా మాస్టర్ మరో 50 కోట్ల వరకు వసూలు చేసేలా కనిపిస్తున్నాడు. 

More Related Stories