మాస్టర్ ను పట్టిన పైరసీ భూతం..దండం పెడుతూ వేడుకుంటున్న దర్శకుడు



Master Movie
2021-01-12 13:39:19

ఒకప్పుడు సినిమా విడుదలయ్యాక ఫైరసి వచ్చి సినిమాకు నష్టం కలిగేది. కానీ ఇప్పుడు సినిమా విడుదల కాంకుండానే ఫైరసి భూతం వెంటాడుతోంది. ఇప్పటికే ఎన్నో  సినిమాల నుండి కొన్ని సీన్లు విడుదలకు ముందే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తాజాగా తమిళ స్టార్ హీరో నటించిన "మాస్టక్" కు కూడా అలాంటి కష్టాలే వచ్చిపడ్డాయి. మాస్టర్ సినిమా కొన్ని గంటల క్రితం ఫైరసి బారిన పడింది. దాంతో చిత్ర యూనిట్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ సినిమా షూటింగ్ ఏడాది క్రితమే పూర్తయింది. 

కానీ కరోనా లాక్ డౌన్ తో సినిమాను విడుదల చేయకుండా ఆగారు. ఓటీటీ ఓ రిలీజ్ చేయడానికి భారీ ఆఫర్లు వచ్చినప్పటికీ సినిమాను ఎలాగైనా థియేటర్ లోనే రిలీజ్ చేయాలని ఇంతకాలం కాపాడారు. ఇక ఇప్పుడు సినిమాలోని ఇంటర్ వెల్ కు సంబంధించిన కొన్ని సీన్లు లీక్ అవ్వడంతో చిత్ర యూనిట్ ఆందోళన చెందుతోంది. మాస్టర్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ ట్విట్టర్ ద్వారా ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ చేసారు. "మాస్టర్ సినిమాను మీ ముందు తీసుకురావడానికి ఏడాది కష్టపడ్డాం. సినిమాను థియేటర్ లో చూసి సంతోషిస్తారని ఆశిస్తున్నాం. సినిమా విడుదలకు మరొక్కరోజే ఉంది. మీకు సోషల్ మీడియాలో లింక్ కనిపిస్తే దయచేసి ఎవ్వరికీ షేక్ చేయకండి" అంటూ కనకరాజ్ వేడుకున్నారు.

More Related Stories