సెన్సార్ పూర్తి చేసుకున్న మత్తు వదలరా Mathu Vadalara Censor
2019-12-21 00:41:21

తెలుగు తెరకి మరో కొత్త హీరో పరిచయమవుతున్నాడు అది కూడా సినీ నేపధ్యం ఉన్న కుటుంబానికి చెందిన వాడే. ఎవరా అనుకుంటున్నారా ఆయనే దిగ్గజ సంగీత దర్శకుడు కీరవాణి చిన్న కొడుకు శ్రీసింహా. 'మత్తు వదలరా' సినిమా ద్వారా సింహ హీరో గా టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ .. క్లాప్ ఎంటర్టైన్ మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ద్వారా రితేశ్ అనే నూతన దర్శకుడు పరిచయమవుతున్నాడు. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే ఈ సినిమాకి, కీరవాణి పెద్ద తనయుడు కాలభైరవ సంగీతాన్ని అందించారు. ఈ నెల 25న రిలీజ్ కానున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డువారు ఈ సినిమాకి U/A సర్టిఫికెట్ ను మంజూరు చేశారు. ఈ సినిమాలో సింహాతో పాటుగా నరేష్‌ ఆగస్త్య, అతుల్య చంద్ర, సత్య, వెన్నెల కిషోర్‌, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘మత్తువదలరా’ ట్రైలర్‌పై టాలీవుడ్‌ నటులు ప్రశంసలు కురిపించారు. హీరోలు ప్రభాస్‌, రానా చిత్ర బృందానికి సోషల్‌మీడియా ద్వారా ఆల్‌ ది బెస్ట్ చెప్పారు. ట్రైలర్‌ నచ్చిందని, సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నామని పోస్ట్‌ చేశారు. ఇక ఈ ఇద్దరి చిన్నాన్న రాజమౌళి అయితే ‘మా అబ్బాయిలు కాలభైరవ, శ్రీసింహ ఒకే చిత్రంతో పరిచయం అవుతున్నారు. ఇది చాలా భావోద్వేగ సందర్భం. రితేష్‌ అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ డిసెంబరు 25న నేను షూటింగ్‌ మానేస్తా.. మానేస్తా.. ’’ -అంటూ ట్విటర్‌ లో పేర్కొని సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచారు.

More Related Stories