మత్తు వదలరా టీజర్ రివ్యూ.. సింహా వచ్చాడోచ్..Mathu Vadalara movie teaser
2019-12-08 02:15:22

రాజమౌళి కుటుంబం నుంచి ఇప్పటి వరకు కేవలం టెక్నీషియన్స్ మాత్రమే వచ్చారు. నటనకు వాళ్లు దూరంగానే ఉన్నారు. కీరవాణి కొడుకు కాల భైరవ కూడా మ్యూజిక్ వైపు అడుగులు వేసాడు. కానీ ఇప్పుడు ఆయన చిన్న కొడుకు సింహా మాత్రం హీరో అవుతున్నాడు. అది కూడా మైత్రి మూవీ మేకర్స్ లాంటి స్టార్ ప్రొడక్షన్ హౌజ్ అతన్ని లాంచ్ చేస్తుంది. ఈయన నటిస్తున్న తొలి సినిమా మత్తు వదలరా టీజర్ విడుదలైంది.

నిండా బోర్లా పడుకుని.. ఏ మాత్రం ఉలుకు పలుకు లేకుండా ఉన్న సింహా లుక్ ఆకట్టుకుంటుంది. సినిమా అంతా అతినిద్రతో బాధ పడే జబ్బుతో ఉన్నాడు సింహా. అదే కథగా రాసుకున్నాడు దర్శకుడు రితీష్. దాని ముందే యమదొంగ స్టిల్ కూడా చాలా బాగుంది. అందులో ఎన్టీఆర్ చేసిన ప్రమోషనల్ సాంగ్ లో ఫాలోస్ ఫాలోస్ అంటూ యాక్ట్ చేసాడు సింహా. అదే కుర్రాడు ఇప్పుడు హీరో అవుతున్నాడు. కొత్త దర్శకుడు రితేష్ రానా దీన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం కోసం అంతా కొత్త వాళ్లే పని చేస్తుండటం విశేషం. కీరవాణి పెద్దబ్బాయి కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు. రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికే మొదలైంది. వచ్చే ఏడాది సినిమా విడుదల కానుంది. కచ్చితంగా ఈ చిత్రంతో సింహా మంచి నటుడిగా పేరు తెచ్చుకుంటాడని ధీమాగా చెబుతున్నారు దర్శక నిర్మాతలు. మరి చూడాలిక.. రాజమౌళి కుటుంబం నుంచి రాబోయే ఆ వారసుడు ఎలా ఉండబోతున్నాడో..? 

More Related Stories