మీకు మాత్రమే చెప్తా ట్రైలర్.. ఫోన్‌తో జర భద్రం భాయ్..Meeku Maathrame Cheptha Trailer
2019-10-16 18:32:10

విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి చేసిన సినిమా మీకు మాత్రమే చెప్తా. కింగ్ ఆప్ ది హిల్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు విజయ్. ఎవ్రీ ఫోన్ హ్యాజ్ ఇట్స్ సీక్రెట్స్ అనేది ట్యాగ్ లైన్. దీన్నిబట్టే కథ కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ట్రైలర్ కూడా ఇదే కట్ చేసాడు దర్శకుడు సుల్తాన్. అసలు ఈ ట్రైలర్ చూసిన తర్వాత సినిమా ఎలా ఉండబోతుందో కూడా క్లారిటీ వచ్చేసింది.

ప్రతీ ఒక్కరు ఫోన్ లో మాట్లాడుతున్నపుడు కానీ.. ఫోన్ వాడుతున్నపుడు కానీ కచ్చితంగా ప్రైవేట్ వీడియోస్ ఉండటం అనేది కామన్. ఇప్పుడు ఇదే పాయింట్ తీసుకుని మీకు మాత్రమే చెప్తా అంటూ వస్తున్నాడు కొత్త దర్శకుడు షమ్మీర్ సుల్తాన్. ఈ చిత్ర ట్రైలర్ ను మహేష్ బాబు లాంఛ్ చేసాడు. విజయ్ దేవరకొండ నిర్మాత కావడంతో కచ్చితంగా ఆసక్తి కూడా పెరిగిపోయింది. టీజర్లో ప్రతీ పని చేసి దొరికిపోయిన తర్వాత ఛీటింగ్ అంటే కాదంటారు అంటూ అనసూయ డైలాగులు చెబుతున్న తీరు బట్టి చూస్తుంటే.. ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్ అబద్ధాల కోరుగా నటిస్తున్నాడని అర్థమవుతుంది. ఫన్నీ స్టోరీతో ఉన్న టీజర్ అదిరిపోయింది. ఇప్పుడు ట్రైలర్ దానికంటే అద్భుతంగా కట్ చేసాడు దర్శకుడు.

ఇందులో ఈ నగరానికి ఏమైంది ఫేమ్ అభినవ్ గోమటం కీలక పాత్రలో నటిస్తున్నాడు. అనసూయ భరద్వాజ్, వాణి భోజన్, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పుడు విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. టైటిల్ కు తగ్గట్టుగానే ఫన్ ఎంటర్టైనర్ గా ఉండబోతోందని తెలుస్తుంది.  మీకు మాత్రమే చెప్తా అనే క్యాచీ టైటిల్ తో వస్తోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అబద్ధాలు చెబితే అంతే అనే చిన్న పాయింట్ చుట్టూ ఈ కథను అల్లుకున్నాడు కొత్త దర్శకుడు సల్మాన్. ఇక థియేటర్ లో పూర్తిగా నవ్వులు పూయడం ఖాయం అని అర్థమైపోతుంది కూడా. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ దశలో ఉంది ఈ చిత్రం. మరి ఈ చిత్రంతో విజయ్ ఎలాంటి మాయ చేస్తాడో చూడాలి.

More Related Stories