మెగా కుటుంబాన్ని క‌లిపిన కాట‌మ‌రాయుడు..2017-04-01 14:24:40

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు పేరుకు మెగా ఫ్యామిలీ హీరో అయినా ఆయ‌న్ని అభిమానులు మాత్రం ఒంటరిగానే చూస్తున్నారు. మెగా ఫ్యామిలీ మొత్తం ఒక‌వైపు.. ప‌వ‌న్ ఒక్క‌డు ఒక‌వైపు అన్న‌ట్లుంది ఇప్పుడు ప‌రిస్థితి. ప‌వ‌న్ ను కావాల‌నే మెగా కుటుంబం దూరం పెడుతున్నారో.. లేదంటే ప‌వ‌నే కావాల‌ని మెగా ఫ్యామిలీకి దూరం అవుతున్నాడో తెలియ‌దు గానీ ఇద్ద‌రి మ‌ధ్య దూరం మాత్రం ఉంద‌నేది కాద‌న‌లేని వాస్త‌వం. బ‌య‌టి వేడుక‌ల్లో మాత్రం తామంతా ఒక్క‌టే అని చెబుతున్నా.. అంత‌రం మాత్రం క‌న‌బ‌డుతూనే ఉంది. ఎంత మూయాల‌న్నా ఆ గ్యాప్ అలాగే బ‌య‌టికి వ‌స్తుంది. అయితే ఈ మ‌ధ్యే మెగా ఫ్యామిలీలో ఓ విచిత్రం చోటు చేసుకుంది. ప‌వ‌న్ న‌టించిన కాట‌మ‌రాయుడు కోసం మెగా కుటుంబం మొత్తం ఏక‌మైంది. ఈ సినిమా విడుద‌లైన రోజే.. అల్లు అర‌వింద్ ఇంట్లో స్పెష‌ల్ షో వేసుకుని మ‌రీ చూసారు మెగా ఫ్యామిలీ. ఈ షోకు చిన్నాపెద్దా అని తేడా లేకుండా మొత్త‌మంతా వ‌చ్చారు. అల్లు అర‌వింద్ తో పాటు చిరంజీవి కూడా త‌మ్ముడి సినిమాను చూసారు. చూడ‌ట‌మే కాదు.. కాట‌మ‌రాయుడిగా ప‌వ‌న్ న‌ట‌న‌ను చూసి పొంగిపోయారు మెగాస్టార్. మెగా ఫ్యామిలీకి కాట‌మ‌రాయుడు బాగా న‌చ్చేసాడ‌ట‌. మొత్తానికి ప‌వ‌న్ సినిమా కోసం అల్లు ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యామిలీ కూడా ఒక్క‌ట‌య్యార‌న్న‌మాట‌.

More Related Stories