మెగాస్టార్ చిరంజీవి, మోహన్ రాజా, కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ గాడ్ ఫాదర్ ఊటీ షెడ్యూల్ ప్రారంభంMegastar Chiranjeevi Godfather New Shooting Schedule Commences In Ooty
2021-09-22 21:12:28

మెగాస్టార్ చిరంజీవి 153వ సినిమాను మోహన్ రాజా తెరకెక్కిస్తుండగా.. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ కలిసి సంయుక్తంగా భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గాడ్ ఫాదర్ అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. చిరంజీవి బర్త్ డే సందర్బంగా ఆగస్ట్ 22న విడుదల చేసిన గాడ్ ఫాదర్ టైటిల్ మోషన్ పోస్టర్‌కు సోషల్ మీడియాలో అధ్బుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో చిరంజీవి కనిపించబోతోన్నారు.

మెగాస్టార్ సినిమా అంటే అభిమానులకు ఎలాంటి అంచనాలుంటాయో తెలిసిన దర్శకుడిగా మోహన్ రాజా.. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాకు మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేశారు. ఈ మూవీ షూటింగ్ గత నెలలో హైద్రాబాద్‌లో ప్రారంభమైంది. ఆ షెడ్యూల్ లో మెగాస్టార్ మీద పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌లను తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ కొత్త షెడ్యూల్ ఊటీలో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో చిరంజీవి, ఇతర ముఖ్య తారాగణం మీద కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.

మాస్టర్ సినిమాటోగ్రఫర్ నీరవ్ షా కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక తమన్ అధ్బుతమైన సంగీతాన్ని అందించేందుకు సిద్దమయ్యారు. సురేష్ సెల్వరాఘవన్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More Related Stories