గద్దలకొండ గణేష్ సినిమాని మెచ్చుకున్న మెగాస్టార్  Chiranjeevi
2019-09-24 18:23:26

మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి సినిమా చివరి నిమిషంలో పేరు మార్చుకుని గద్దలకొండ గణేష్‌ గా థియేటర్స్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. సినిమాలో ఉన్న మాస్ కంటెంట్ ప్రేక్షకులకు బాగా నచ్చడంతో క్లాస్, మాస్ అనే తేడా లేకుండా సింగిల్ స్క్రీన్స్ నుండి మల్టీప్లెక్స్ వరకు గద్దలకొండ గణేష్ కలెక్షన్స్ రచ్చ రేపుతోంది. దీంతో మొదటి రోజే 5.5 కోట్ల భారీ డిస్ట్రిబ్యూటర్ షేర్ రాబట్టిన గద్దలకొండ గణేష్ శని,ఆది, సోమవారాల్లో కూడా బాగానే వసూలు చేశాడు. ఇక ఈ రోజు గద్దలకొండ గణేష్ సినిమాని ప్రత్యేకంగా చూసిన మెగాస్టార్ చిరంజీవి వరుణ్ పెర్ఫార్మన్స్ చాలా బాగుందని మెచ్చుకున్నారని యూనిట్ ప్రకటించింది. హరీష్ శంకర్ చాలా బాగా తీశాడని, డైలాగ్స్ చాలా బాగున్నాయని అన్నారని చిరంజీవి మెచ్చుకున్నారట. 

ఏ విషయంలొనూ కాంప్రమైజ్ కాకుండా నిర్మాతలు సినిమా తీశారని. సినిమాలో టీం స్పిరిట్ కనిపిస్తోందని ఆయన ప్రశంసించినట్టు సినిమా యూనిట్ ప్రకటించింది. ఇక మరో పక్క ఈ సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చూశాడట. 'గద్దలకొండ గణేష్' చూస్తూ బాగా ఎంజాయ్ చేశానని. వరుణ్ తేజ్ గణేష్ గా అద్భుతంగా నటించాడని. హరీష్ శంకర్, 14 రీల్స్ సినిమాని చాలా బాగా తెరకెక్కించారని, మంచి సక్సెస్ అందుకున్న సినిమా యూనిట్ అందరికీ అభినందనలు అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ కి ట్విట్టర్ లోనే హీరో వరుణ్ తేజ్,  దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాతలు రామ్ , గోపి థాంక్స్ చెప్పారు.

More Related Stories