జైపూర్ కోటలో ఘనంగా మెహ్రీన్ నిశ్చితార్థం



Mehreen Pirzada
2021-03-13 11:28:27

టాలీవుడ్ బ్యూటీ మెహ్రీన్ ప్రిజాడ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుంది అంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మెహ్రీన్ నిశ్చితార్ధం ఈ నెల 12న జైపూర్ లోని ఓ కోటలో ఘనంగా జరిగింది. తన నిశ్చితార్థం ఫోటోలను మెహ్రీన్ సోషల్ మీడియాలో షేర్ చేసి ఫ్యాన్స్ తో పంచుకుంది.  మెహ్రీన్ నిశ్చితార్థం హర్యానా కు చెందిన కాంగ్రెస్ ఎంపీ తనయుడు భవ్య బిష్ణోయ్ తో జరిగింది. భవ్య బిష్ణోయ్ కూడా యువ రాజేకీయ నాయకుడు కావడం విశేషం. అంతే కాకుండా బిష్ణోయ్ తాత భజన్ లాల్ హర్యానా మాజీ ముఖ్యమంత్రి గా పనిచేసారు. ఇదిలా ఉండగా మెహ్రీన్ టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ సినిమాలు తీస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్ 2 సినిమాలో హానీ ఈజ్ ద బెస్ట్ అంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం ఎఫ్ 2 సినిమా సీక్వెల్ గా వస్తున్న ఎఫ్ 3 లోనూ వరుణ్ తేజ్ కు జోడిగా నటిస్తోంది.

More Related Stories